మైక్రోసాఫ్ట్ ఎడ్జ్.. సరికొత్త ఫీచర్‌ అదుర్స్

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఆన్ లైన్‌‌‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ-కామర్స్ సైట్‌లలో సెర్చ్ చేస్తాం. కానీ ఏ సైట్‌లోనూ ఆ ధరల చరిత్రను, అంతకుముందు ఉన్న ధరలు గురించి లేదా ధరలు మారుతూ వచ్చిన విధానం ఎవరికీ తెలియనివ్వరు. అటువంటి సమస్యను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ త్వరలో తమ సౌలభ్యం కోసం ప్రైస్ ట్రాకర్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ‘ప్రైస్ ట్రాకర్’ ఫీచర్‌ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో షాపింగ్ చేసే కష్టమర్లకు […]

Update: 2021-11-19 21:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఆన్ లైన్‌‌‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ-కామర్స్ సైట్‌లలో సెర్చ్ చేస్తాం. కానీ ఏ సైట్‌లోనూ ఆ ధరల చరిత్రను, అంతకుముందు ఉన్న ధరలు గురించి లేదా ధరలు మారుతూ వచ్చిన విధానం ఎవరికీ తెలియనివ్వరు. అటువంటి సమస్యను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ త్వరలో తమ సౌలభ్యం కోసం ప్రైస్ ట్రాకర్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ‘ప్రైస్ ట్రాకర్’ ఫీచర్‌ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో షాపింగ్ చేసే కష్టమర్లకు ధరల పట్టిక, ధరల వ్యత్యాసం, కూపన్‌లను యాక్సెస్ వంటి వివరాలను తెలియజేసే విధంగా ఉపయోగపడుతోందని ‘లైట్ బెన్-జుర్ కంపెనీ’ “మోడరన్ లైఫ్” మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో పాటు కష్టమర్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో హ్యాక‌ర్స్‌, సైబ‌ర్ క్రిమిన‌ల్స్ దాడికి గురి అయినప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియజేసి లీక్ అయిన పాస్‌వర్డ్‌లను సులభంగా మార్చుకోవడానికి వీలు కల్పించనుంది.

Tags:    

Similar News