అభిషేక్ శర్మ ఊచకోత.. 40 బంతుల్లోనే సెంచరీ

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రెచ్చిపోయాడు.

Update: 2025-04-12 17:16 GMT
అభిషేక్ శర్మ ఊచకోత.. 40 బంతుల్లోనే సెంచరీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి రఫ్పాడించారు. ఆరు సిక్సులు, 11 ఫోర్లతో అభిమానుల కేరింతలు రెట్టింపు చేశాడు. ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయిన SRH జట్టు.. 170కి పైగా పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకో 70కి పైగా పరుగులు చేయాల్సి ఉంది.

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings).. అనుకున్నట్లే భారీ స్కో్ర్ చేసింది. ప్రియాన్స్ ఆర్యా(36), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(82), నేహాల్ వధేరా(27)లు దంచికొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 245 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయం సాధించాలంటే 246 పరుగులు చేయాల్సి ఉంది. ఎస్ఆర్‌హెచ్(SRH) బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు. 

Tags:    

Similar News