పెన్సిల్ ములికిపై ‘స్వేతార్కమూల గణపతి’..
దిశ, నర్సంపేట టౌన్ : గణపతి నవరాత్రులను పురస్కరించుకుని నర్సంపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ స్వేత(పెన్సిల్) ములికిపై ఖాజీపేటలో కొలువైన స్వేతార్కమూల గణపతిని చెక్కి అబ్బురపరిచాడు. గత పన్నెండు సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణ కోసం జల కాలుష్య నివారణ కోసం మట్టి గణపతులనే పూజించాలి అంటూ ప్రతిఏటా విభిన్నమైన సూక్ష్మ గణపతులను తయారు చేసి ప్రజలకు సందేశం అందించేవారు. అందులో భాగంగానే ఈసారి కూడా స్వేత పెన్సిల్ పై […]
దిశ, నర్సంపేట టౌన్ : గణపతి నవరాత్రులను పురస్కరించుకుని నర్సంపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ స్వేత(పెన్సిల్) ములికిపై ఖాజీపేటలో కొలువైన స్వేతార్కమూల గణపతిని చెక్కి అబ్బురపరిచాడు. గత పన్నెండు సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణ కోసం జల కాలుష్య నివారణ కోసం మట్టి గణపతులనే పూజించాలి అంటూ ప్రతిఏటా విభిన్నమైన సూక్ష్మ గణపతులను తయారు చేసి ప్రజలకు సందేశం అందించేవారు. అందులో భాగంగానే ఈసారి కూడా స్వేత పెన్సిల్ పై మహిమాన్వితమైన స్వేతార్కమూల గణపతిని సృష్టించినట్లు జయకుమార్ తెలిపారు.