ప్రిన్స్ హ్యారీ, మేఘన్ అనుభవాలు ప్రపంచానికి పాఠం : మిచెల్ ఒబామా
దిశ, ఫీచర్స్ : అమెరికన్ టాక్ షో ‘టెల్ ఆల్’లో భాగంగా గతవారం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ను ఓఫ్రా విన్ ఫ్రే ఇంటర్వ్యూ చేయగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాజకుటుంబంలో తాను ఇమడలేకపోయానని.. గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మేఘన్ తెలిపారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలో యూఎస్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాజాగా ‘యాక్సెస్ హాలీవుడ్’ అనే షోలో పార్టిసిపేట్ చేయగా, […]
దిశ, ఫీచర్స్ : అమెరికన్ టాక్ షో ‘టెల్ ఆల్’లో భాగంగా గతవారం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ను ఓఫ్రా విన్ ఫ్రే ఇంటర్వ్యూ చేయగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాజకుటుంబంలో తాను ఇమడలేకపోయానని.. గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మేఘన్ తెలిపారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలో యూఎస్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాజాగా ‘యాక్సెస్ హాలీవుడ్’ అనే షోలో పార్టిసిపేట్ చేయగా, మేఘన్ వ్యాఖ్యలపై స్పందించింది.
‘తమ కుమారుడు ఆర్చీ చర్మం రంగు ఎంత నల్లగా ఉంటుందోనని కుటుంబంలోని ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశారని ఓఫ్రాకు మేఘన్ తెలిపారు. ప్యాలెస్‌లో జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా వినిపించాయని మేఘన్ అన్నారు . అయితే, ఆ వ్యాఖ్యలు రాణి లేదా రాజు చేసినవి కాదని హ్యారీ స్పష్టం చేశారు. అయితే తన కొడుకు చర్మం గురించి బ్రిటీష్ రాజకుటుంబ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు హృదయ విదారకం. మేఘన్ అనుభవాలు ప్రపంచానికి ఒక పాఠం అవుతాయని నేను ఆశిస్తున్నాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, జాతి వివక్ష ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉంది, కాబట్టి ఆమె రేసిజం గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించలేదు. నేను ఆశిస్తున్న.. ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే.. మొదట కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు చర్చించాలి. వారికి మంచి జరగాలని, వారి హృదయాన్ని గాయపరిచిన మాటల నుంచి త్వరగా బయటపడి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మిచెల్ ఒబామా తెలిపారు. అమెరికా మొదటి మహిళగానే కాకుండా, మహిళలు, బాలికల హక్కుల ఉద్యమకారిణిగా, న్యాయవాది, రచయిత్రిగా మిచెల్ సుపరిచితురాలు.