విడాకులు తీసుకుంటే ‘కంగ్రాట్స్’ చెప్పాలి ‘సారీ’ కాదు : పోర్న్ స్టార్

దిశ, సినిమా : ఎక్స్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా భర్త రాబర్ట్ సాండ్‌బర్గ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడాది వివాహబంధానికి స్వస్తి చెప్పేసినట్లు తెలిపింది. నెలరోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మ్యారేజ్‌ను నిలుపుకోవడం చాలా హార్డ్‌గా ఉందని, అందుకే ఎవరిదారి వారు చూసుకోవడమే బెటర్ అనిపించిందని చెప్పింది. దీంతో, తన పట్ల సింపతీ ప్రకటిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయన్న అడల్ట్ స్టార్.. ఎవరైనా విడాకులు తీసుకున్నప్పుడు ‘ఐ యామ్ […]

Update: 2021-07-25 06:19 GMT

దిశ, సినిమా : ఎక్స్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా భర్త రాబర్ట్ సాండ్‌బర్గ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడాది వివాహబంధానికి స్వస్తి చెప్పేసినట్లు తెలిపింది. నెలరోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మ్యారేజ్‌ను నిలుపుకోవడం చాలా హార్డ్‌గా ఉందని, అందుకే ఎవరిదారి వారు చూసుకోవడమే బెటర్ అనిపించిందని చెప్పింది.

దీంతో, తన పట్ల సింపతీ ప్రకటిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయన్న అడల్ట్ స్టార్.. ఎవరైనా విడాకులు తీసుకున్నప్పుడు ‘ఐ యామ్ సారీ’కి బదులు ‘కంగ్రాట్స్’ చెప్పాలని, ఇది సాధారణం అయిపోవాలని కోరుకుంది. మనమందరం ఐస్ క్రీమ్ కోసం ఏడ్చే పరిస్థితుల్లో లేమని, మనజీవితాన్ని మనం చూసుకోగలమని అభిప్రాయపడింది.

Tags:    

Similar News