వరంగల్ MGMలో దారుణం.. బ్లడ్ రివర్స్ పంపింగ్ అయ్యేలా సెలెన్ బాటిల్ చేతిలో పెట్టి..!

దిశ, కాశిబుగ్గ : పేరుకే పెద్దాస్పత్రి. అందులో ఎవరి దారి వారిదే. పేదలు ఎవరైనా ఆస్పత్రికి వస్తే చాలు చీదరించుకుంటారు అందులోని సిబ్బంది. వైద్యం చేయకుండానే ఆరు బయటకు వెళ్లగొడ్తారు. ఈ దారుణమైన దుస్థితి ఎక్కడుందో తెలుసా.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్లీ అంత పెద్ద సిటీగా చెప్పుకునే వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్లో.. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణ పేదప్రజలకు సంజీవనీ అనుకోవచ్చు. ఇక్కడి నిత్యం వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. […]

Update: 2021-12-01 11:49 GMT

దిశ, కాశిబుగ్గ : పేరుకే పెద్దాస్పత్రి. అందులో ఎవరి దారి వారిదే. పేదలు ఎవరైనా ఆస్పత్రికి వస్తే చాలు చీదరించుకుంటారు అందులోని సిబ్బంది. వైద్యం చేయకుండానే ఆరు బయటకు వెళ్లగొడ్తారు. ఈ దారుణమైన దుస్థితి ఎక్కడుందో తెలుసా.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్లీ అంత పెద్ద సిటీగా చెప్పుకునే వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్లో.. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణ పేదప్రజలకు సంజీవనీ అనుకోవచ్చు.

ఇక్కడి నిత్యం వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. చికిత్స కోసం వచ్చేవారంతా నిరుపేదలు.. అయితే, ఇటువంటి నిరుపేదలకు వైద్యం అందించడంలో గానీ, సేవ చేయడంలో అక్కడి సిబ్బంది, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓ వ్యక్తి తన ఇంట్లో సమస్యల వలన మనస్తాపం చెంది బుధవారం నిద్రమాత్రలు మింగాడు. వెంటనే అతన్ని హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు.అయితే, ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడంతో అతనికి సెలైన్ పెట్టి ఆ బాటిల్ పేషెంట్ చేతికి ఇచ్చి ఆరు బయట కూర్చోబెట్టారు. దీంతో ఆ యువకుడి శరీరంలోని రక్తం కాస్త సెలెన్ బాటిల్‌లోకి రివర్స్ పంపింగ్ అయినట్టు కనిపించింది. సెలెన్ బాటిల్ చేతిలో పట్టుకుని ఉన్న రోగి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రాణం కాపాడాలని ఆస్పత్రికి వస్తే రోగులతో ఇలానే ప్రవర్తిస్తారా? అంటూ ఎంజీఎం సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News