మూడు నగరాల్లో మెట్రో బంద్

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగుళూరు, జైపూర్ నగరాల్లో మెట్రో సర్వీసులను మూసివేయాలని నిర్ణయించారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 22వ తేదీన జైపూర్ నగరంలో మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు జైపూర్ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేర ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు మెట్రోరైలు అధికారులు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా […]

Update: 2020-03-20 20:22 GMT

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగుళూరు, జైపూర్ నగరాల్లో మెట్రో సర్వీసులను మూసివేయాలని నిర్ణయించారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 22వ తేదీన జైపూర్ నగరంలో మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు జైపూర్ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేర ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు మెట్రోరైలు అధికారులు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా నోయిడా నగరంలో మెట్రో సిటీ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు నోయిడా అథారిటీ సీఈవో రితూ మహేశ్వరీ చెప్పారు.

Tags: corona virus,Metro Bandh in three cities,Janata Curfew,Delhi, Bangalore, Jaipur,Prime Minister Narendra Modi

Tags:    

Similar News