మహిళల డబుల్స్ విజేతలు మెర్టెన్స్, సబలెంక
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తుది అంకానికి చేరుకున్నది. శుక్రవారం మెయిన్ స్టేడియం రాడ్ లావెర్ అరేనాలో జరిగిన మహిళల డబుల్స్‌లో బెల్జియం-బెలారస్ జోడి రెండవ సీడ్ ఎలీస్ మెర్టెన్స్, ఆర్యన సబలెంక మూడో సీడ్, చెక్ రిపబ్లిక్ జోడి బార్బోరా క్రెజికోవా, కెటెరీనా సినియాకోవాపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది. మెర్టెన్స్, సబలెంక జోడీకి ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ కావడం గమనార్హం. 2019లో ఇదే జోడి యూఎస్ […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తుది అంకానికి చేరుకున్నది. శుక్రవారం మెయిన్ స్టేడియం రాడ్ లావెర్ అరేనాలో జరిగిన మహిళల డబుల్స్‌లో బెల్జియం-బెలారస్ జోడి రెండవ సీడ్ ఎలీస్ మెర్టెన్స్, ఆర్యన సబలెంక మూడో సీడ్, చెక్ రిపబ్లిక్ జోడి బార్బోరా క్రెజికోవా, కెటెరీనా సినియాకోవాపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది. మెర్టెన్స్, సబలెంక జోడీకి ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ కావడం గమనార్హం.
2019లో ఇదే జోడి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన వారిద్దరికీ ఇది రెండో గ్రామ్ స్లామ్ టైటిల్. ఈ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు మరో నాలుగు డబుల్స్ టైటిల్స్ కూడా వారి ఖాతాలో ఉన్నాయి. వీరిద్దరూ మహిళల సింగిల్స్‌లో నాలుగవ రౌండ్‌లోనే వెనుదిరిగారు. దీంతో డబుల్ టైటిల్‌పై పూర్తిగా దృష్టిపెట్టి ఏకంగా చాంపియన్లుగా నిలిచారు. కాగా, డబుల్స్ ఫైనల్‌లో ఓడిన జోడీలో ఒకరైన బార్బోరా క్రెజికోవా శనివారం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ఫైనల్లో తలపడుతుండటం విశేషం.