దసరాకు 550 కార్లను డెలివరీ చేసిన బెంజ్

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దసరా సందర్భంగా 550 కార్లను డెలివరీ చేసినట్టు సోమవారం వెల్లడించింది. వీటిలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఈ పండుగ సమయంలో 175 యూనిట్లను ఇవ్వగా, రాబోయే దీపావళి సమయంలో బలమైన డిమాండ్‌ను దక్కించుకోనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఏడాది పండుగ సీజన్ అత్యంత సానుకూలంగా ప్రారంభమైంది. వినియోగదారుల […]

Update: 2020-10-26 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దసరా సందర్భంగా 550 కార్లను డెలివరీ చేసినట్టు సోమవారం వెల్లడించింది. వీటిలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఈ పండుగ సమయంలో 175 యూనిట్లను ఇవ్వగా, రాబోయే దీపావళి సమయంలో బలమైన డిమాండ్‌ను దక్కించుకోనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

‘ఈ ఏడాది పండుగ సీజన్ అత్యంత సానుకూలంగా ప్రారంభమైంది. వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉండటం సంతోషంగా ఉందని’ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మార్టిన్ ష్వెంక్ చెప్పారు. దసరా సందర్భంగా చేసిన డెలివరీలు పండుగ సీజన్ పట్ల తమ నమ్మకాన్ని పెంచాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులు తమ బ్రాండ్, ఉత్పత్తులపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారన్నారు. ఇంకా పండుగ కాలంతో పాటు ఈ త్రైమాసికంలో అమ్మకాల వేగం మరింత మెరుగ్గా ఉంటుందనే నమ్మక ఉందని, కొత్త మోడళ్లను మార్కెట్లోకి రానున్నాయి. రానున్న రోజుల్లో అమ్మకాల రికవరీ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News