Olympics : వెనుదిరిగిన పురుషులు.. దూసుకెళ్లిన మహిళలు!

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకం తెస్తుందని ఆశ పెట్టుకున్న వారందరినీ నిరాశపరిచింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడిన భారత్ జట్టు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది. దీంతో 5-2 ఆధిక్యం కనబరిచిన బెల్జియం జట్టు భారత్‌ను ఓడించింది. ఇదిలాఉండగా మహిళల హాకీ బృందం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, ఒలింపిక్ పతకం సాధించడంలో […]

Update: 2021-08-02 23:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకం తెస్తుందని ఆశ పెట్టుకున్న వారందరినీ నిరాశపరిచింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడిన భారత్ జట్టు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది. దీంతో 5-2 ఆధిక్యం కనబరిచిన బెల్జియం జట్టు భారత్‌ను ఓడించింది.

ఇదిలాఉండగా మహిళల హాకీ బృందం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, ఒలింపిక్ పతకం సాధించడంలో పురుషులు పోరాడి ఓడినా.. సెమీస్‌‌కు చేరిన మహిళా క్రీడాకారులు అయినా ప్రత్యర్థిని కట్టడి చేసి పురుషులు సాధించలేని పతకాన్ని వారు సాధించి చూపిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News