ఆ ప్రపంచంలో.. మీమ్స్ బ్రహ్మ.. బ్రహ్మానందం..

దిశ, ఫీచర్స్: మీమ్స్, సోషల్ మీడియాకు అవినాభావ సంబంధం ఉంటుంది. సోషల్ మీడియా కమ్యూనికేటివ్ ప్లాట్‌ఫామ్ అయితే.. ఏ విషయంపైనైనా అభిప్రాయం లేదా ఆలోచనను క్రియేటివ్‌గా ఆవిష్కరించేదే మీమ్. సింపుల్‌గా కామన్ మ్యాన్ ఆలోచనలు, భావాలను వ్యక్తకీరించే చిత్రం లేదా వీడియో. మీమ్స్‌లో చాలావరకు క్యాప్షన్డ్ ఫొటోలతో కామెడీని జనరేట్ చేసేవే కాగా.. సున్నితమైన, వివాదాస్పదమైన అంశాన్ని కూడా సునిశిత హాస్యం తో చెప్పగలగడమే వీటి ప్రత్యేకత. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా క్షణాల్లో జనాల్లోకి […]

Update: 2021-12-12 03:16 GMT

దిశ, ఫీచర్స్: మీమ్స్, సోషల్ మీడియాకు అవినాభావ సంబంధం ఉంటుంది. సోషల్ మీడియా కమ్యూనికేటివ్ ప్లాట్‌ఫామ్ అయితే.. ఏ విషయంపైనైనా అభిప్రాయం లేదా ఆలోచనను క్రియేటివ్‌గా ఆవిష్కరించేదే మీమ్. సింపుల్‌గా కామన్ మ్యాన్ ఆలోచనలు, భావాలను వ్యక్తకీరించే చిత్రం లేదా వీడియో. మీమ్స్‌లో చాలావరకు క్యాప్షన్డ్ ఫొటోలతో కామెడీని జనరేట్ చేసేవే కాగా.. సున్నితమైన, వివాదాస్పదమైన అంశాన్ని కూడా సునిశిత హాస్యం తో చెప్పగలగడమే వీటి ప్రత్యేకత. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా క్షణాల్లో జనాల్లోకి వెళ్లగలగడం వీటికున్న మరో ప్లస్ పాయింట్.

ఫిల్మ్స్, పాలిటిక్స్, ఎంప్లాయ్‌మెంట్ నుంచి ప్రొఫెషనల్, పర్సనల్ అండ్ మ్యారేజ్ లైఫ్ వరకు అనేక సమస్యల తీవ్రతను ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా చేయడమే మీమ్ స్టైల్. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మీమ్స్ క్రియేషన్‌కు పొలిటీషియన్స్ లేదా ఫిల్మ్ యాక్టర్స్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ కథా వస్తువులు కాగా.. అవి సరిగ్గా పేలేందుకు వారి ఇమేజ్ కూడా హెల్ప్ అవుతుంది. అయితే మీమ్స్ సృష్టించడం కత్తి మీద సాము వంటిదే. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిన.. తలెత్తే పరిణామాలను ఊహించలేం.

మీమ్స్ బ్రహ్మ.. బ్రహ్మానందం

1200 కు పైగా చిత్రాల్లో నటించిన గిన్నిస్ బుక్ హోల్డర్, కామెడీ రారాజు పద్మశ్రీ బ్రహ్మానందంను మీమ్స్‌కు ఆరాధ్యుడిగా చెప్పుకోవచ్చు. ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌పై వచ్చినన్ని మీమ్స్.. బహుషా ఏ సెలబ్రిటీపై రాలేదంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా చెప్పాలంటే ఆయన ఇవ్వని ఎక్స్‌ప్రెషన్ లేదంటేనే కరెక్టేమో. ఎలాంటి మీమ్‌ క్రియేట్ చేయాలన్నా ఆయనిచ్చిన ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవడమే అందుకు కారణం కాగా.. తనను ఒక మీమ్స్ లైబ్రరీగా పేర్కొనవచ్చు. ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ఆయన విలన్లతో తలపడే సీన్లు, మాస్ డైలాగ్స్‌తో రూపొందిన మీమ్స్‌ ఆటం బాంబుల్లా పేలుతుంటాయి.

తొడగొడితే రైలు వెనక్కి వెళ్లడం, కంటి చూపుతో కుర్చీ కదలడం వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రియల్ లైఫ్‌కు దూరంగా ఉండే పాత్రలు, కామిక్ క్యారెక్టర్లతో క్రియేట్ చేసిన మీమ్స్‌తోనే ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ లీడర్లలో సీఎం కేసీఆర్ ఆయా ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడిన వాయిస్ బిట్ల ఆధారంగా రూపొందించిన మీమ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అమలుకు నోచుకోని వారి ప్రకటనలు, హామీలపైనే కాకుండా మేనరిజమ్స్‌తో కూడిన మీమ్స్ ఫన్‌తో పాటు వాస్తవ పరిస్థితికి అద్దం పడతాయి.

సమాచారం.. నిరసన..

మీమ్స్ ప్రధాన ఉద్దేశ్యం కామెడీయే అయినా.. సొసైటీ యాక్సెప్టెన్స్ పొందని అనేక విషయాలపై సెటైరికల్ థాట్‌ను కూడా ప్రొజెక్ట్ చేస్తుంటాయి. చూసేందుకు చాలా సింపుల్‌గా ఒక ఫొటో, దాని కింద రెండు వ్యాక్యాలు కనిపించినా.. ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే మీమ్ క్రియేషన్ అనేది చూసి ఎంజాయ్ చేసినంత సులభం కాదు. ప్రపంచవ్యాప్త విషయాలపై స్పష్టమైన అవగాహన, మంచి చెడును విశ్లేషించే సామర్థ్యంతో పాటు పబ్లిక్ పల్స్‌ను పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ చేసే సత్తా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సీఎం, పీఎం స్థాయి వ్యక్తులపై.. వారి పాలసీలు, పాలన మీద కావలసినన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభుత్వం, ఆయా లీడర్లపై సామాన్యుడి అభిప్రాయాన్ని సూటిగా చెప్పగలిగిన మీమ్స్ మాత్రమే వైరల్‌గా మారతాయి. లేదంటే మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రమోషన్.. ఇన్‌ఫర్మేషన్

సమాచార వ్యాప్తి విషయానికొస్తే.. కరోనా విపత్కర పరిస్థితుల్లో, లాక్‌డౌన్ టైమ్‌లో పాటించాల్సిన నిబంధనలపై అనేక మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఇవి ఒక రకంగా వైరస్ వ్యాప్తి పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎదురయ్యే ప్రమాదాలపైనా క్లియర్ కట్ సమాచారాన్ని అందించాయని చెప్పవచ్చు. అంతేకాదు నిబంధనలు పాటించకుంటే పోలీసుల పనిష్మెంట్ గురించి కూడా అనేక మీమ్స్ తయారయ్యాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల పోలీసులు సినిమాల్లోని ఫేమస్ సీన్లు, క్రికెట్‌ గేమ్‌లోని పాపులర్ షాట్స్‌తో పాటు ఆటగాళ్ల పొరపాట్లను ఉపయోగించి కూడా మీమ్స్ చేస్తున్నారు. వీటితో ఆయా విషయాలపై జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన అనేక ఉద్యమాల ఉద్దేశ్యాన్ని ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేయడంలోనూ మీమ్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి హీరోలు సైతం తమపై వచ్చిన మీమ్స్‌నే తెలివిగా తిరిగి ప్రచారానికి వాడుకుంటున్నారు.

వ్యక్తిత్వం, ఆలోచన ప్రతిబింబిస్తుందా?

కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం ఫొటోను అనేక కాంట్రవర్సీ మీమ్స్‌కు ఉపయోగిస్తుంటారు. అయినా ఆయన ఏమాత్రం నొచ్చుకోడు. గుర్తింపుకు నోచని ఎంతోమంది టాలెంట్‌కు తను పరోక్షంగా కారణం అవుతున్నందుకు ఆనందపడతాడు. దశాబ్దాల సినీ, వ్యక్తిగత అనుభవమే.. ఆయన చిత్రాలతో చేస్తున్న మీమ్స్‌పైనా హుందాగా స్పందించగలిగే సహృదయాన్ని ఇచ్చింది. బ్రహ్మీ పిక్‌తో చేసిన మీమ్ ఇంపాక్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇక పలువురు డైరెక్టర్లు, టెక్నీషియన్ల కాపీ కంటెంట్‌ పైనా మీమ్స్ రూపొందుతున్నాయి. అంతేకాదు సినిమాల్లో కథానాయికలను చూపించే విధానం, వారితో నెరిపే సంబంధాలపై చురకలంటించే విధంగానూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

హీరోయిన్ల పట్ల వారి ఆలోచనా తీరు ను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను, నెటిజన్లను కూడా ఆలోచింపజేస్తున్నాయి. అప్పటిదాకా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం లో ఉన్న సంశయాన్ని తీరుస్తున్నాయి. గణాంకాలు, ఉదాహరణలతో సహా చూపించి వారి బలహీనతను వేలెత్తి చూపుతున్నాయి. ఇవే కాదు మధ్య తరగతి వ్యక్తి చిన్న చిన్న ఆనందాలు, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌ సమస్యలపై హాస్యభరితంగా రూపొందే మీమ్స్.. వాస్తవికతను ప్రదర్శిస్తున్నాయి. వాటిని చూసి రిలేట్ చేసుకున్న వ్యక్తులకు తెలియని ఉపశమనాన్ని కలిగిస్తుంటాయి. అందుకే మీమర్స్ ఐడియాలజీకి ‘ఖుదోస్’ చెప్పాల్సిందే.

Tags:    

Similar News