సిర్పూర్కర్ కమిషన్ విచారణ.. ‘దిశ’ ఎన్‌కౌంటర్ స్థలంలో ఉద్రిక్తత

దిశ, ఫరూక్ నగర్: దేశంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ స్థలాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు యువకుల తరపున కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సుప్రీంకోర్టు కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి పరిధిలోని టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లోని ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలించారు. ‘దిశ’ మృతదేహాన్ని కాల్చిన బ్రిడ్జిని కూడా చూశారు. ఈ విచారణలో […]

Update: 2021-12-05 06:54 GMT

దిశ, ఫరూక్ నగర్: దేశంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ స్థలాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు యువకుల తరపున కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సుప్రీంకోర్టు కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి పరిధిలోని టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లోని ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలించారు. ‘దిశ’ మృతదేహాన్ని కాల్చిన బ్రిడ్జిని కూడా చూశారు. ఈ విచారణలో పాల్గొన్న మాజీ న్యాయమూర్తుల బృందం సభ్యులు రేఖ, మాజీ డీజీపీ కార్తికేయ, వారి బృందం వెంట రాచకొండ సీపీ మహేష్ భగవత్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, సీఐ శ్రీధర్ కుమార్‌లు ఉన్నారు. అయితే, ఎన్ కౌంటర్ స్థలాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు పరిశీలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు న్యాయమూర్తుల బృందాన్ని కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలతో వారికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ కౌంటర్ స్థలంలో సుమారు 40 నిమిషాల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు.

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి

అయితే, విచారణ జరుపుతోన్న బృందాన్ని కలిసేందుకు చాలామంది స్థానిక ప్రజా ప్రతినిధులు వచ్చారు. ఈ క్రమంలో బందోబస్తు నిర్వహిస్తోన్న పోలీసులు ఎవరినీ దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు-ప్రజా ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట సైతం జరుగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘దిశ’ కమిషన్‌ సభ్యులకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఒక యువతిని దారుణంగా, అత్యంత పాశవికంగా లైంగికదాడి చేసి సజీవ దహనం చేస్తే నిందితుల తరపున విచారణ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి, దేశంలో మహిళలకు, చిన్నారులకు విచారణ బృందం ఏం సదేశాలు ఇస్తోందని మండిపడ్డారు. పోలీసులపై దాడి చేసి చంపాలని ప్రయత్నించిన నిందితులను చంపడం తప్పేంటని, నిందితులను రక్షించే విధంగా సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ విచారణలో యువతికి న్యాయం చేసిన పోలీసులను బలి పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని బృందం సభ్యులను హెచ్చరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.

Tags:    

Similar News