గత ఐదు నెలల్లో 4 వేల వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గడచిన నాలుగైదు నెలల్లో నాలుగు వేల వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్‌కుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చామని, ఆక్సిజన్, బెడ్‌ల సంఖ్యను పెంచామని […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గడచిన నాలుగైదు నెలల్లో నాలుగు వేల వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్‌కుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చామని, ఆక్సిజన్, బెడ్‌ల సంఖ్యను పెంచామని నీతి ఆయోగ్ సభ్యుడికి వివరించారు.
కరోనా పేషెంట్ల అవసరాల కోసం నాలుగు వేల వైద్య పోస్టులను మంజూరు చేశామని, హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారికోసం ‘హితం’ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.