దశాబ్దంలో మోస్ట్ పాపులర్ వెడ్డింగ్ డ్రెస్సుల్లో.. మేఘన్ టాప్
దిశ, ఫీచర్స్ : హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ బ్రిటన్ రాణి ఎలిజబిత్-2 మనవడు ప్రిన్స్ హ్యారీని మే 19, 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసింది. జీవితంలో తనకు ఎంతో ముఖ్యమైన ఈ శుభదినాన మేఘన్ అత్యద్భుతమైన డిజైనర్ పెళ్లి గౌనులో మెరిసింది. మేఘన్ మార్కెల్ పెళ్లి దుస్తులు ఇంటర్నెట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. కాగా ఆమె వెడ్డింగ్ గౌన్ దశాబ్ద కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వివాహ గౌన్‌ల న్యూ లిస్ట్‌లో మొదటి […]
దిశ, ఫీచర్స్ : హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ బ్రిటన్ రాణి ఎలిజబిత్-2 మనవడు ప్రిన్స్ హ్యారీని మే 19, 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసింది. జీవితంలో తనకు ఎంతో ముఖ్యమైన ఈ శుభదినాన మేఘన్ అత్యద్భుతమైన డిజైనర్ పెళ్లి గౌనులో మెరిసింది. మేఘన్ మార్కెల్ పెళ్లి దుస్తులు ఇంటర్నెట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. కాగా ఆమె వెడ్డింగ్ గౌన్ దశాబ్ద కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వివాహ గౌన్‌ల న్యూ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలవగా, కేట్ మిడిల్టన్ వెడ్డింగ్ గౌన్ రెండో స్థానాన్ని పొందింది.
ప్రపంచ ప్రముఖ ష్యాషన్ డిజైనర్స్ రాల్ఫ్ అండ్ రస్సో, అలెగ్జాండర్ మెక్ క్వీన్ వంటి హేమాహేమీలు మేఘన్ డ్రెస్ రూపొందించారనే ఊహగానాలతో ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ జరిగింది. కానీ ఆమె మాత్రం బ్రిటీష్ స్టైలిష్ట్ క్లెయిర్ వెయిట్ కెల్లర్ రూపొందించిన ఐవరీ సిల్క్ వెడ్డింగ్ గౌన్ ధరించి ఏంజెల్‌లా మెరిసిపోయింది. సాంప్రదాయక దుస్తులకు ఆధునికత జోడించి ప్రత్యేకంగా రూపొందించిన గౌన్ మేఘన్ అందాన్ని మరింత పెంచింది. ఆమె 16.5 అడుగుల పట్టు టుల్లె – వీల్, చేతితో ఎంబ్రాయిడరీ చేయబడి ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. ఈ వీల్ 53 కామన్వెల్త్ దేశాల్లో ఉన్న విలక్షణమైన అందమైన పూలను సూచించేలా డిజైన్ చేశారు. మేఘన్ ఇష్టపడే వింటర్ స్వీట్, కాలిఫోర్నియా పాప్పీ పూలు కూడా ఈ వీల్‌పై చోటు దక్కించుకున్నాయి.
ఫైండ్ మి ఎ గిఫ్ట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం నెటిజన్లు ఎక్కువగా శోధించిన పెళ్లి గౌను మేఘన్‌దేనని వెల్లడించారు. మేఘన్ వివాహ గౌనును సగటు నెలవారీగా 21,900 మంది శోధించగా, కేట్ నెలవారీ గౌను శోధనలు 21,500 పరిమితమయ్యాయి. ఇక హేలీ బీబర్ ఆఫ్-షోల్డర్ వెడ్డింగ్ గౌన్ మూడో స్థానంలో ఉంది. ఆమె 2018లో జస్టిన్ బీబర్‌ను వివాహం చేసుకుంది.