బహ్రయిన్‌లో ఘనంగా మోగాస్టార్ బర్త్ ‌డే సెలబ్రేషన్స్..

దిశ, వెబ్‌డెస్క్ : బహ్రయిన్‌లో మెగా అభిమానులు ఘనంగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఉద్యోగ నిమిత్తం గల్ఫ్ దేశమైన బహ్రయిన్‌లో నివసిస్తున్న తెలుగు మెగా అభిమానులు అంతా పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా రమణ స్వామినాయుడు ఆదేశాల మేరకు మొక్కలు నాటారు. ఆ తర్వాత ఒక హోటల్‌లో కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి ఎన్నో […]

Update: 2021-08-21 21:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బహ్రయిన్‌లో మెగా అభిమానులు ఘనంగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఉద్యోగ నిమిత్తం గల్ఫ్ దేశమైన బహ్రయిన్‌లో నివసిస్తున్న తెలుగు మెగా అభిమానులు అంతా పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా రమణ స్వామినాయుడు ఆదేశాల మేరకు మొక్కలు నాటారు.

ఆ తర్వాత ఒక హోటల్‌లో కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలందిస్తూ, ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సమయంలో 40 కోట్ల రూపాయల తన సొంత సొమ్ముతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్లు స్థాపించిన విషయం గుర్తు చేసుకుని మెగా అభిమానులంతా చిరు సేవలను కొనియాడారు.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవికి శుభాకాంక్షలు వారు తెలిపారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు.

కాగా డ్యాన్స్‌, డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ముద్రను వేసుకున్న చిరంజీవి, ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులను ఆయన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు రాయుడు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు ఉప్పుటూరి, ఆనంద్ రాకుర్తి, శ్రీకాంత్ గోక, భరత్ కుమార్ యండమూరి వెంకట కిషోర్ కాసగాన, కిరణ్ మానెం, శ్రీనివాస్ పంతం కిరణ్ దేవులపల్లి, పడాల శ్రీను, రాజేష్ చీకర్మిల్లి, వెంకటేష్ సిరి శెట్టి, గోపాలకృష్ణ గొర్రెల మైగాపుల రామకృష్ణ, అంగర రవి రంగాతో పాటు పలువురు మెగా అభిమానులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News