కరోనాపై యుద్ధం ప్రకటించిన మెగా ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి… కరోనా మహమ్మారి ప్రభావం తో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి ఒక్కరే కాదు… మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కూడా అటు పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కు .. ఇటు కరోనా క్రైసిస్ చారిటీ కి విరాళాలు అందించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని […]

Update: 2020-04-15 02:10 GMT

మెగాస్టార్ చిరంజీవి… కరోనా మహమ్మారి ప్రభావం తో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి ఒక్కరే కాదు… మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కూడా అటు పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కు .. ఇటు కరోనా క్రైసిస్ చారిటీ కి విరాళాలు అందించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ ఇవ్వటమే కాదు.. సీసీసీ తరపున కోటి మ్యూజిక్ డైరెక్షన్లో ఓ సాంగ్ కూడా కంపోజ్ చేయగా అందులో నటించి ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్నారు. కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు చేస్తున్న పోరాటంలో రియల్ హీరోస్ డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ మెగా ఫ్యామిలీ నుంచి ప్రతీ ఒక్కరూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ అంతా కలిసి విలువైన సూచనలు అందించారు. స్టే హేమ్.. స్టే సేఫ్ మెసేజ్ ను ఇచ్చిన మెగా కుటుంబం… ఇంట్లో ఉంటాం యుద్ధం చేస్తాం… క్రిమిని కాదు ప్రేమను పంచుతాం… కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం…భారతీయులం ఒక్కటై భారత్ ను గెలిపిస్తాం.. అంటూ బోర్డులను ప్రదర్శిస్తున్న ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫొటోలో చిరు, అల్లు అరవింద్, నాగబాబు, చరణ్, వరుణ్, తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నిహారిక, కళ్యాణ్ దేవ్, ఉపాసన, సుష్మిత, శ్రీజ కనిపించగా… కలిసి కరోనా పై యుద్ధంలో విజయం సాధిద్దాం… మనం ఉన్న చోటనే ఉందాం… మనల్ని, మన ప్రియమైన వారిని , ప్రపంచాన్ని రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు.

Tags: Chiranjeevi, Allu Aravind, Ram Charan, Upasana, Mega family
Slug :

Tags:    

Similar News