పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: రాజయ్య

దిశ, మెదక్: కార్మిక చట్టాలు సవరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య హెచ్చరించారు. గురువారం నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శ్రామిక భవనంలో సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు కార్మిక చట్టాలను రద్దు చేయాలని చూస్తోందని, పని గంటల పెంపు యోచనలో ఉందని ఆరోపించారు. కరోనా లాక్ డౌన్ తో ప్రజలు పని లేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు […]

Update: 2020-06-11 04:07 GMT

దిశ, మెదక్: కార్మిక చట్టాలు సవరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య హెచ్చరించారు. గురువారం నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శ్రామిక భవనంలో సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు కార్మిక చట్టాలను రద్దు చేయాలని చూస్తోందని, పని గంటల పెంపు యోచనలో ఉందని ఆరోపించారు. కరోనా లాక్ డౌన్ తో ప్రజలు పని లేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులందరికీ వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మికులను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News