సమంతాదే ప్రపంచంలో అతిపెద్ద నోరు
దిశ, ఫీచర్స్ : నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందని అంటుంటారు. కానీ నోరు పెద్దదైతే ‘గిన్నిస్’ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయొచ్చని తెలుసా? అయితే 31 ఏళ్ల సమంత రామ్స్డెల్ గురించి తెలుసుకోవాల్సిందే. టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన సమంత తన నోటితో గిన్నిస్ పుస్తకాల్లో ఎక్కేసింది. సమంత టిక్‌టాక్‌లో తన ఫన్నీ వీడియోలతో పాటు, పెద్ద నోటితోనే ఫేమస్ అయింది. ఆమె వీడియోలు మిలియన్ వ్యూస్ పొందడమే కాకుండా, పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోనూ షేర్ […]
దిశ, ఫీచర్స్ : నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందని అంటుంటారు. కానీ నోరు పెద్దదైతే ‘గిన్నిస్’ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయొచ్చని తెలుసా? అయితే 31 ఏళ్ల సమంత రామ్స్డెల్ గురించి తెలుసుకోవాల్సిందే. టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన సమంత తన నోటితో గిన్నిస్ పుస్తకాల్లో ఎక్కేసింది.
సమంత టిక్‌టాక్‌లో తన ఫన్నీ వీడియోలతో పాటు, పెద్ద నోటితోనే ఫేమస్ అయింది. ఆమె వీడియోలు మిలియన్ వ్యూస్ పొందడమే కాకుండా, పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లోనూ షేర్ అవుతుంటాయి. సాధారణంగా అందరికంటే పెద్ద నోరు ఉండటంతో తన ఫాలోవర్స్ ఆమెను గిన్నిస్ రికార్డ్‌కు అప్లయ్ చేయమని చెప్పడంతో సమంత ఇటీవలే వారికి దరఖాస్తు చేసుకుంది.
ఈ మేరకు అమెరికా, సౌత్ నార్వాక్‌లోని స్థానిక దంతవైద్యుని కార్యాలయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కోసం ఆమె తన నోటిని మెజర్ చేయించింది. డాక్టర్ ఎల్కే చెయంగ్ సామ్ నోటి పొడవు, వెడల్పును లెక్కించడానికి డిజిటల్ కాలిపర్లను ఉపయోగించగా 6.52 సెంటీమీటర్లు ఉందని నిర్ధారించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా గిన్నిస్ నిర్వాహకులు ఆమెకు సర్టిఫికేట్ అందజేశారు. కాగా ఆమె కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఇంత పెద్ద నోరు లేకపోవడం గమనార్హం. చిన్ననాటి నుంచి తన పెద్ద నోరు వల్ల అవహేళనకు గురైనా, సమంత మాత్రం ఆ నోరుతోనే అందరికీ నవ్వులు పంచుతూ టిక్ టాక్ వీడియోలను చేస్తోంది. ఆమె నోరు ఎంతపెద్దగా ఉంటుందంటే.. ఆపిల్ మొత్తం ఆ నోట్లో పట్టేస్తుంది. అతిపెద్ద పరిమాణంలో ఫ్రెంచ్ ప్రైస్‌ను నోటిలో ఒకేసారి పెట్టుకోగలదు. నాలుగు సింగిల్ చీజ్ బర్గర్లను ఒకేసారి తినేయగలదు.
‘నా నోరు నన్ను మిలియన్ల మంది హాస్యనటులు, గాయకులు, ఇతర కంటెంట్ క్రియేటర్స్ నుంచి భిన్నంగా ఉంచింది. ఇదే నోటితో నేను ఫేమస్ అవుతానిని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఇది జరిగింది. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. కానీ ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా ‘లార్జ్ బాడీ పార్ట్’ కలిగి ఉంటే చింతించకండి అదే మీకు ప్రత్యేకమైంది. దాన్ని మీ అతిపెద్ద ఆస్తిగా భావించండి. ఇది మీ సూపర్ పవర్, ఇది మిమ్మల్ని ఇతరుల నుంచి యూనిక్‌గా ఉంచుతుంది. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌కు అప్లయ్ చేసుకోవాలనుకుంటే సంకోచించకుండా వెంటనే చేసేయండి’
– సమంత