ఆరేళ్లకే అద్భుత గాత్రం.. మెలోడీ పాటలతో మెస్మరైజ్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా లాక్‌డౌన్ వల్ల.. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ తమలోని టాలెంట్‌కు మరింత మెరుగులు దిద్దుకున్నారు. చిన్నారులు కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఇషాన్’ అనే 6 ఏండ్ల బాలుడు.. అలనాటి పాటలను అద్భుతంగా పాడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఇషాన్ స్వర ప్రయాణం మార్చిలో మొదలైంది. ఇక వాళ్ల నాన్న ‘గౌరవ్ చింతమని’ కూడా సంగీత కళాకారుడే. ఆడియో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన […]

Update: 2020-08-29 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా లాక్‌డౌన్ వల్ల.. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ తమలోని టాలెంట్‌కు మరింత మెరుగులు దిద్దుకున్నారు. చిన్నారులు కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ‘ఇషాన్’ అనే 6 ఏండ్ల బాలుడు.. అలనాటి పాటలను అద్భుతంగా పాడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నాడు.

ఇషాన్ స్వర ప్రయాణం మార్చిలో మొదలైంది. ఇక వాళ్ల నాన్న ‘గౌరవ్ చింతమని’ కూడా సంగీత కళాకారుడే. ఆడియో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన ఆయన శ్రీ అరబిందో సెంటర్ ఫర్ ఆర్స్ట్ అండ్ కమ్యూనికేషన్‌లో మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రొగ్రామర్‌గా చేస్తున్నాడు. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ కూడాను. అద్వైత గిటారిస్ట్ కూడాను. ఇషాన్ తండ్రే సంగీత కళాకారుడైన తర్వాత.. తనకు స్వరాలు రాకుండా ఉంటాయి. పాటలు పాడకుండా ఆపగలమా? ఆ క్రమంలోనే ఇంట్లో ఎప్పుడూ వినిపించే మెలోడీ పాటలను తనదైన స్వరంతో ఆలపించేవాడు. అలా సరదాగా మొదలైన హాబీ.. ఇప్పుడు వాళ్లకు ఓ వ్యసనంగా, ఇష్టంగా మారిపోయింది. కొడుకు పాడుతుంటే తండ్రి గిటార్ వాయించేవాడు. ఇక లాక్‌డౌన్ టైమ్‌లో అయితే గౌరవ్, ఇషాన్‌లు పాటలు పాడుతూ టైమ్‌పాస్ చేసేవాళ్లు. అలా.. మార్చిలో వాళ్లిద్దరూ తాము పాడిన పాటలను వీడియోగా తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇషాన్ టాలెంట్‌కు నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. తన వాయిస్‌తో పాటు పాడే విధానం చూస్తే.. తప్పకుండా సింగర్‌గా రాణిస్తాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చిన్నారుల ప్రతిభను చిన్నప్పుడే గుర్తించి, వాళ్లను ఆ దిశగా అడుగులు వేయిస్తే.. వాళ్లు అద్భుతాలు చేసి చూపిస్తారు. అంతేకాదు, ఈ ప్రపంచంలోని ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News