వరుడు..వధువు కాళ్లు మొక్కాడు..
దిశ, వెబ్ డెస్క్: హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి జరిగిన తర్వాత..పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. భర్త కాళ్లు మొక్కుతూ ఆశీస్సులు కోరుతుంది వధువు. పండుగల వేళ..వ్రతాలు, నోముల సందర్భాల్లోనూ భార్య భర్త కాళ్లు మొక్కడం ఆచారం. అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఓ వరుడు ఈ సంప్రదాయాలను బ్రేక్ చేశాడు. మహిళలు, పురుషులు సమానమేననంటూ కాళ్లు మొక్కాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇంటి పేరు కూడా మార్చుకుని ఓ సరికొత్త సంప్రదాయానికి […]
దిశ, వెబ్ డెస్క్: హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి జరిగిన తర్వాత..పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. భర్త కాళ్లు మొక్కుతూ ఆశీస్సులు కోరుతుంది వధువు. పండుగల వేళ..వ్రతాలు, నోముల సందర్భాల్లోనూ భార్య భర్త కాళ్లు మొక్కడం ఆచారం. అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఓ వరుడు ఈ సంప్రదాయాలను బ్రేక్ చేశాడు. మహిళలు, పురుషులు సమానమేననంటూ కాళ్లు మొక్కాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇంటి పేరు కూడా మార్చుకుని ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీశాడు.
వివరాల్లోకెళితే..ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల కోసం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్లింది. అక్కడే దీపకు స్టూడెంట్ లీడర్ ఒలేగ్ బుల్లర్‌తో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు సంతోషంగా ఒప్పుకున్నాయి. పెండ్లి సాఫీగా సాగిపోయింది. దీప, బుల్లెర్లు యూరోపియన్, భారతీయ సంస్కృతుల కలయికగా పెండ్లి చేసుకున్నారు. పెండ్లి వేదికపై దీపను ఒలేగ్ పాదాలకు నమస్కరించమని పురోహితుడు చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ‘వధూవరులు ఇద్దరూ సమానమే..మరి అటువంటప్పుడు ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి’ అని వరుడు బుల్లెర్ ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని బుల్లెర్ దీప పాదాలకు మొక్కాడు. అంతేకాదు వధూవరులిద్దరూ ఒకరి ఇంటి పేరు ఒకరు మార్చుకున్నారు. వధువు దీప బుల్లర్ ఖోస్లా అని పెట్టుకోగా, వరుడు ఒలేగ్ బుల్లర్ ఖోస్లా అని మార్చుకున్నాడు. స్త్రీ, పురుషుల సమానత్వం గురించి చాటి చెప్పిన వీరి గురించి, వారి పెండ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.