మెడికల్ చెత్త.. మహా సమస్య!
ఒకప్పుడు గ్లోవ్స్, మాస్కులను కేవలం డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పెట్టుకునేవారు. అది కూడా అప్పుడప్పుడు, అవసరైనప్పుడే పెట్టుకునేవారు. కానీ కొవిడ్ 19 కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు గ్లోవ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తరచుగా చేతులు కడుక్కోలేక సింగిల్ యూజ్ గ్లోవ్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా పది నుంచి ఇరవై మాస్కులు ఉంటున్నాయి. ఇక పడేసే చెత్తలో చూస్తే అన్నీ మాస్కులు, శానిటైజర్ డబ్బాలు, గ్లోవ్స్ ఉంటున్నాయి. మరి […]
ఒకప్పుడు గ్లోవ్స్, మాస్కులను కేవలం డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పెట్టుకునేవారు. అది కూడా అప్పుడప్పుడు, అవసరైనప్పుడే పెట్టుకునేవారు. కానీ కొవిడ్ 19 కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు గ్లోవ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తరచుగా చేతులు కడుక్కోలేక సింగిల్ యూజ్ గ్లోవ్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా పది నుంచి ఇరవై మాస్కులు ఉంటున్నాయి. ఇక పడేసే చెత్తలో చూస్తే అన్నీ మాస్కులు, శానిటైజర్ డబ్బాలు, గ్లోవ్స్ ఉంటున్నాయి. మరి ఆస్పత్రుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలు సమయాల్లోనే నీడిల్స్, సెలైన్ బాటిల్స్, సిరంజిలు ఇలా బోలెడంత మెడికల్ చెత్త ఉండేది. ఇప్పుడు అది మూడింతలు పెరిగింది.
సాధారణంగా మెడికల్ ఆపరేషన్లు చేస్తున్నపుడు పేషెంట్‌ను ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు పనిచేస్తారు. కాబట్టి ఆపరేషన్ కోసం పరిశుభ్రమైన సూదులు, కత్తులు, ఇతర పరికరాలు ఉపయోగించాలనుకుంటారు. అందుకోసం ఒక్కసారి వాడి పారేసే వాటికి ప్రాధాన్యతను ఇస్తారు. సుస్థిరాభివృద్ధిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులకు వాడిన పరికరాలనే, స్టెరిలైజ్ చేసి మళ్లీ వాడితే జరగరానిది ఏదైనా జరిగి ఇన్ఫెక్షన్ వస్తే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే అలాంటి సమయాల్లో రిస్కు తీసుకోవాలని ఏ వైద్యుడు కూడా అనుకోడు. ఈ కారణంగానే ఇప్పుడు మెడికల్ చెత్త ( Medical waste) మూడింతలు అయింది.
కరోనా తర్వాత మిగిలిపోతున్న మెడికల్ చెత్తలో 15 శాతం ప్రమాదకరమైన చెత్త ఉంది. అంటే కరోనా పాజిటివ్ పేషెంట్లకు సంబంధించిన చెత్త ఇది. వాటిలో ఏదో ఒక మూలన వైరస్ బతికే ఉంటుంది. అందుకే స్టెరిలైజ్ చేసి వాడుకోలేం. కాబట్టి నాశనం చేయక తప్పని పరిస్థితి. సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్‌లు, టెస్టింగ్ కోసం ఉపయోగించిన నీడిల్స్, ఇతర పరికరాలు ఈ కోవకు చెందుతాయి. ఇక 85 శాతం చెత్త ప్రమాదకరమైనది కాదు. అంటే పేషెంట్‌తో పాటు వచ్చి హాస్పిటల్‌లో ఉండేవారు, బయటి ఉష్ణోగ్రత చెక్ చేసే సిబ్బంది ధరించిన కిట్‌లు, ఉపయోగించిన వస్తువులు ఈ కోవకు చెందుతాయి. వీలైతే వీటిని పునర్వినియోగించుకోవచ్చు. అవసరానికి ఉపయోగపడనంతవరకు స్టెరిలైజ్ చేసి ఉపయోగించుకోవచ్చు.
పైకి కనిపించడం లేదు గానీ, భూమ్మీది కర్బన ఉద్గారాల్లో ఆరోగ్యరంగ భాగం కూడా పెద్దమొత్తంలోనే ఉంది. మొత్తం ఆరోగ్య రంగాన్ని ఒక దేశంగా పరిగణిస్తే గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసే దేశాల్లో ఇది ఐదో స్థానంలో ఉంటుదని హెల్త్ కేర్ వితౌట్ హార్మ్ అనే ఎన్‌జీవో నివేదికలో తేలింది. అంటే 514 బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్లు విడుదల చేసే వాయువులకు సమానం అన్నమాట. ఇక ఇప్పుడు కొవిడ్ తర్వాత పేరుకుపోయిన మెడికల్ చెత్తను కూడా పరిగణనలోకి తీసుకుంటే అది రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పర్యావరణ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భావితరాల ఆరోగ్యాన్ని పాడుచేయడానికి మానవుడు ఏ మాత్రం సంకోచించడం లేదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.