వేతనాలు వెంటనే చెల్లించాలి

దిశ, సిద్దిపేట: గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కుటుంబ పోషణ భారంగా మారిందనీ, వెంటనే పెండింగ్ ‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల ఎదుట ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో పని చేస్తున్న సుమారు వంద మంది సిబ్బందికి ఎనిమిది నెలల నుండి ఎస్.కె.ఈ కంపెనీ కాంట్రాక్టర్ వేతనాలను చెల్లించక పోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. […]

Update: 2020-10-19 05:08 GMT

దిశ, సిద్దిపేట: గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కుటుంబ పోషణ భారంగా మారిందనీ, వెంటనే పెండింగ్ ‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల ఎదుట ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో పని చేస్తున్న సుమారు వంద మంది సిబ్బందికి ఎనిమిది నెలల నుండి ఎస్.కె.ఈ కంపెనీ కాంట్రాక్టర్ వేతనాలను చెల్లించక పోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి సుమారు యాబై వేల రూపాయల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్‌ను కోరినప్పుడు డబ్బులు లేవని చెప్తూ ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న కళాశాల అర్ఎంఓ వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళన విరమించారు.

Tags:    

Similar News