మెడికల్ షాపులపై అధికారుల కొరడా
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని పలు చోట్ల అధికారులు మెడికల్ షాపులపై కొరడా ఝులిపించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి చర్యలు చేపట్టారు.వివరాల్లోకివెళితే..పెద్దపల్లి పట్టణంలోని అపోలో ఫార్మసీ వద్ద వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని గుర్తించిన స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ షాపు యజమానిని మందలించారు. షాఫు యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తహశీల్దారుతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అపోలో ఫార్మసీని సీజ్ చేసినట్టు శ్రీనివాస్ వెల్లడించారు.మరోవైపు సుల్తానాబాద్‌లో అధిక […]
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని పలు చోట్ల అధికారులు మెడికల్ షాపులపై కొరడా ఝులిపించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి చర్యలు చేపట్టారు.వివరాల్లోకివెళితే..పెద్దపల్లి పట్టణంలోని అపోలో ఫార్మసీ వద్ద వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని గుర్తించిన స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ షాపు యజమానిని మందలించారు. షాఫు యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తహశీల్దారుతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అపోలో ఫార్మసీని సీజ్ చేసినట్టు శ్రీనివాస్ వెల్లడించారు.మరోవైపు సుల్తానాబాద్‌లో అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందుకున్న అధికారులు 2 షాపులపై దాడులు చేశారు. వారికి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్టు తెలిపారు.