మగవాళ్లకు వైద్యశాఖ ఆఫర్.. ఆపరేషన్ చేసి రూ.1100 ఇస్తామంటున్న డాక్టర్లు!
దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలు పుట్టకుండా ఆపరేషన్చేయించుకున్న మగవాళ్లకు వైద్యశాఖ రూ.1100 నగదు అందించనుంది. కుటుంబ నియంత్రణలో పురుషులు కూడా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నది. ఈ మేరకు నో స్కాల్సెల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్‌వీ) ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది. తొలి విడత రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29వ తేది నుంచి షురూ చేయనున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్య లక్ష్మీ మాట్లాడారు. కుటుంబ సంక్షేమంలో భార్యభర్తలు ఇద్దరిదీ సమాన బాధ్యతన్నారు. పిల్లలను కనే కష్టమైన పనిని […]
దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలు పుట్టకుండా ఆపరేషన్చేయించుకున్న మగవాళ్లకు వైద్యశాఖ రూ.1100 నగదు అందించనుంది. కుటుంబ నియంత్రణలో పురుషులు కూడా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నది. ఈ మేరకు నో స్కాల్సెల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్‌వీ) ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది. తొలి విడత రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29వ తేది నుంచి షురూ చేయనున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్య లక్ష్మీ మాట్లాడారు.
కుటుంబ సంక్షేమంలో భార్యభర్తలు ఇద్దరిదీ సమాన బాధ్యతన్నారు. పిల్లలను కనే కష్టమైన పనిని స్త్రీ భరిస్తుండగా, కుటుంబ నియంత్రణలో పురుషులు భాగస్వామ్యం కావాలన్నారు. దీనిలో భాగంగా అతి సులువైన ఎన్ఎస్వీ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఇది కోత, కుట్టులేని అతి సులువైన ఆపరేషన్ అన్నారు. దీన్ని కేవలం 5 నుంచి పది నిమిషాల్లో పూర్తి చేయొచ్చన్నారు. 30 నిమిషాలు అనంతరం ఇంటికి వెళ్లవచ్చన్నారు. దీని వలన లైంగిక పటుత్వంలో, దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం రాదన్నారు. ఆపరేషన్పూర్తయిన మూడు రోజుల తర్వాత ఎలాంటి అపోహలు లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఈనెల 29 నుంచి డిసెంబరు 4 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. 29న సీహెచ్సీ ఇబ్రహీంపట్నం, 30న పీహెచ్‌సీ సరూర్నగర్, డిసెంబరు 1న సీహెచ్‌సీ శంషాబాద్, 2న సీహెచ్‌సీ షాద్ నగర్, 3న సీహెచ్‌సీ చేవేళ్ల, 4వ తేదీన పీహెచ్‌సీ కందుకూర్‌లో ఎన్ఎస్‌వీలను నిర్వహిస్తామన్నారు.