ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు.. వీడియో ఫ్రూఫ్ కోరిన సుప్రీం
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ప్రస్తుతం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు సంచలనం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం విచారణ నిమిత్తం విజయవాడ తీసుకెళ్లి పోలీసుల చిత్రహింసలు పెట్టారని, ఒక సిట్టింగ్ ఎంపీని ఈ విధంగా ట్రీట్ చేస్తారా అంటూ ఆయన తరఫు లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, దానిని హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీం […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ప్రస్తుతం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు సంచలనం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం విచారణ నిమిత్తం విజయవాడ తీసుకెళ్లి పోలీసుల చిత్రహింసలు పెట్టారని, ఒక సిట్టింగ్ ఎంపీని ఈ విధంగా ట్రీట్ చేస్తారా అంటూ ఆయన తరఫు లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, దానిని హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీం మెట్లెక్కారు.
దీనిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఎంపీ రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరపాలని, ఆ మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి భద్రపరచాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఎంపీని గుంటూరు జీజీహెచ్ నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రిపోర్టును సీల్డ్ కవర్ రూపంలో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.