‘మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలి’
మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాను ఆయన మేడారంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వనజాతరను గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా అరణ్య దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం […]
మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాను ఆయన మేడారంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వనజాతరను గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా అరణ్య దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆయనకు స్వాగతం పలికారు.