పెన్కాక్ సిలాట్ చాంపియన్‌షిప్‌లో గ్రీన్ గ్రోవ్ స్కూల్ స్టూడెంట్స్‌కు పతకాలు
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలను సాధించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం హెరాల్డ్ పాఠశాలలో ఈ నెల 21వ తేదీ(ఆదివారం) నిర్వహించిన చాంపియన్ షిప్‌లో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆర్.వరుణ్ తేజ్ 38 కిలోల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. అదే […]
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలను సాధించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం హెరాల్డ్ పాఠశాలలో ఈ నెల 21వ తేదీ(ఆదివారం) నిర్వహించిన చాంపియన్ షిప్‌లో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆర్.వరుణ్ తేజ్ 38 కిలోల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు.
అదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఆర్. అవినాష్ కాంస్య పతకం సాధించాడు. స్వర్ణ పతకం సాధించిన ఆర్. వరుణ్ తేజ్.. డిసెంబర్ 18, 19 తేదీలలో మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులను పాఠశాల ప్రాంగణంలో స్కూల్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కుంగ్ ఫూ కోచ్ ఎమ్. శివలు ప్రత్యేకంగా అభినందించారు.