మార్చి 23 నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్
దిశ,వెబ్‌డెస్క్: కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ నిర్వహణపై నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి–ఏప్రిల్ లో పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పాత నిబంధనల ప్రకారం 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, కొత్త నిబంధనల ప్రకారం 2019–2020 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, పాత రూల్స్ ప్రకారం విద్యార్థుల హాజరు 75 శాతం, […]
దిశ,వెబ్‌డెస్క్: కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ నిర్వహణపై నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి–ఏప్రిల్ లో పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పాత నిబంధనల ప్రకారం 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, కొత్త నిబంధనల ప్రకారం 2019–2020 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, పాత రూల్స్ ప్రకారం విద్యార్థుల హాజరు 75 శాతం, ఇంటర్నల్ మార్కులు 35 శాతం ఉన్నవారిని అర్హులుగా ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం విద్యార్థుల హాజరు 75శాతం, ఇంటర్నల్ మార్కులు 40 శాతంగా ఉండాలని పేర్కొంది. 2016–17 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల థర్డ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.