భయపడొద్దు.. టీకా తీసుకున్న నగర మేయర్
దిశ, తెలంగాణ బ్యూరో : భయపడకుండా కొవిడ్ వాక్సిన్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్న వారు కూడా ఆందోళన చెందకుండా టీకా వేసుకోవాలని సూచించారు. పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం మేయర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతర మేయర్ మాట్లాడుతూ.. రోజుకు దాదాపు 1.20 లక్షల మంది టీకా తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుండగా.. ప్రైవేటు దవాఖానల్లో రూ.250 చెల్లించాల్సి […]
దిశ, తెలంగాణ బ్యూరో : భయపడకుండా కొవిడ్ వాక్సిన్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్న వారు కూడా ఆందోళన చెందకుండా టీకా వేసుకోవాలని సూచించారు.
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం మేయర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతర మేయర్ మాట్లాడుతూ.. రోజుకు దాదాపు 1.20 లక్షల మంది టీకా తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుండగా.. ప్రైవేటు దవాఖానల్లో రూ.250 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.