హైదరాబాద్‌లో 60శ్మశాన‌ వాటిక‌ల‌ అభివృద్ధి

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్‌ న‌గ‌రంలో 60శ్మశాన‌ వాటిక‌ల‌లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు చ‌ర్యలు చేప‌ట్టిన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. సోమ‌వారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేట‌ర్ సాయిబాబాతో క‌లిసి మ‌ల్కంచెరువు సుంద‌రీక‌ర‌ణ‌లో భాగంగా చెరువు వెన‌క‌వైపు వంద అడుగుల వెడ‌ల్పుతో విస్తరించ‌నున్న రోడ్డు ప్రతిపాద‌న‌ల‌ను ప‌రిశీలించారు. ప్రతిపాదిత రోడ్డు విస్తర‌ణ‌కు, హౌసింగ్ బోర్డు భూమికి మ‌ధ్య ఉన్న శ్మశాన‌‌వాటిక‌ను ప‌రిశీలించారు. శ్మశాన‌ వాటిక‌కు విద్యుత్‌, విద్యుత్‌ లైటింగ్‌, తాగునీరు స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్నట్లు తెలిపారు. […]

Update: 2020-07-13 08:11 GMT

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్‌ న‌గ‌రంలో 60శ్మశాన‌ వాటిక‌ల‌లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు చ‌ర్యలు చేప‌ట్టిన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. సోమ‌వారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేట‌ర్ సాయిబాబాతో క‌లిసి మ‌ల్కంచెరువు సుంద‌రీక‌ర‌ణ‌లో భాగంగా చెరువు వెన‌క‌వైపు వంద అడుగుల వెడ‌ల్పుతో విస్తరించ‌నున్న రోడ్డు ప్రతిపాద‌న‌ల‌ను ప‌రిశీలించారు. ప్రతిపాదిత రోడ్డు విస్తర‌ణ‌కు, హౌసింగ్ బోర్డు భూమికి మ‌ధ్య ఉన్న శ్మశాన‌‌వాటిక‌ను ప‌రిశీలించారు. శ్మశాన‌ వాటిక‌కు విద్యుత్‌, విద్యుత్‌ లైటింగ్‌, తాగునీరు స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్నట్లు తెలిపారు. భ‌విష్యత్ అవ‌స‌రాల నిమిత్తం 100ఫీట్ల రోడ్డు నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని బ‌స్తీవాసుల‌ను కోరారు. ఈ ప‌ర్యట‌న‌లో ఈఈ వెంక‌టేశ్వర్లు, ఎ.కె.రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News