పోలీసులకు 90 క్వింటాళ్ల బియ్యం అందజేత
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని జీఎన్ఎంసీ పునరావాస కేంద్రాలు, షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారితోపాటు పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది భోజనాలకు బియ్యం అందించాలని పోలీసు శాఖ మేయర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మేయర్.. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ […]
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నివసించే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని జీఎన్ఎంసీ పునరావాస కేంద్రాలు, షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారితోపాటు పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది భోజనాలకు బియ్యం అందించాలని పోలీసు శాఖ మేయర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మేయర్.. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున జీఎచ్ఎంసీ కార్యాలయంలో 90 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Mayor, Police Department, Police shelters, Civil supply chairman, Rice