మాయే మస్క్.. ప్రౌడ్ మూమెంట్

దిశ, ఫీచర్స్ : టెస్లా మోటార్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధిపతిగా సుపరిచితుడైన దక్షిణాఫ్రికా ఎంటర్‌ప్రెన్యూర్ ఎలన్ మస్క్.. వరల్డ్ బిలియనీర్‌గా ఎదిగా ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశాడు. ‘ఎలన్ వెరీ స్మార్ట్’ అనే విషయాన్ని విస్తరిస్తున్న అతడి సంపదే చెబుతుండగా.. తను అంతటి తెలివితేటల్ని ఎలా సొంతం చేసుకోగలిగాడనే ప్రశ్నకు అతడి సోదరుడు సమాధానమిచ్చాడు. ‘సగటు వ్యక్తి నెలకు ఒక పుస్తకం చదివితే, మస్క్ మాత్రం రోజుకు రెండు పుస్తకాల చొప్పున మనకంటే 60 రెట్లు ఎక్కువగా […]

Update: 2021-03-04 03:10 GMT

దిశ, ఫీచర్స్ : టెస్లా మోటార్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధిపతిగా సుపరిచితుడైన దక్షిణాఫ్రికా ఎంటర్‌ప్రెన్యూర్ ఎలన్ మస్క్.. వరల్డ్ బిలియనీర్‌గా ఎదిగా ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశాడు. ‘ఎలన్ వెరీ స్మార్ట్’ అనే విషయాన్ని విస్తరిస్తున్న అతడి సంపదే చెబుతుండగా.. తను అంతటి తెలివితేటల్ని ఎలా సొంతం చేసుకోగలిగాడనే ప్రశ్నకు అతడి సోదరుడు సమాధానమిచ్చాడు. ‘సగటు వ్యక్తి నెలకు ఒక పుస్తకం చదివితే, మస్క్ మాత్రం రోజుకు రెండు పుస్తకాల చొప్పున మనకంటే 60 రెట్లు ఎక్కువగా చదువుతాడు. పుస్తకాలే అతడికి ఎంతో నాలెడ్జ్‌ను అందించాయి’ అని చెప్పుకొచ్చాడు. కాగా మస్క్ తల్లి ‘మాయే మస్క్’ అతడి గురించి మరో సీక్రెట్ చెప్పడం విశేషం.

ఎలన్ మస్క్ తన 17వ ఏట స్కూల్‌లో రాసిన పరీక్ష పేపర్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ ‘నాకు సరిగ్గా గుర్తుంది.. పరీక్షలో నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటివరకు ఎవరికీ అన్ని రాకపోవడంతో నీకు మళ్లీ పరీక్ష పెట్టారు. అందుకే నువ్విప్పుడు ఇంత గొప్ప ఇంజినీర్ అయ్యావంటే ఆశ్చర్యం కలగడం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రౌడ్ మామ్ (#ProudMom) అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశారు. మస్క్ అప్పుడు దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో పరీక్ష రాశాడు. కాగా మాయే మస్క్ తరచుగా ఎలన్ మస్క్ త్రోబాక్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. కాగా ఎలన్ మస్క్ ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ సంస్థతో అంతరిక్ష రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుండగా, అంగారకుడిపైకి మనుషులను పంపాలనే లక్ష్యంతో ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన మేధోసంపత్తితో ప్రపంచ కుబేరుడిగానూ అవతరించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News