ఇకపై మనుషుల ఐడెంటిటీ.. కాపీ కొట్టాలంటే కష్టమే!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ యుగంలో బడుల నుంచి బడా బడా కార్పొరేట్ ఆఫీసుల దాకా ‘బయోమెట్రిక్’ ఉపయోగించడం సాధారణమైపోయింది. స్మార్ట్‌ఫోన్‌‌తో పాటు ఎయిర్‌పోర్ట్, పోలీసు విభాగాలు, నైట్‌క్లబ్‌ వంటి పలు ప్రదేశాల్లోనూ ‘ఫేస్ రికగ్నిషన్’ తప్పనిసరైంది. ఇలా బయోమెట్రిక్, ఐరిస్, వాయిస్, ఫేషియల్ గుర్తింపును భద్రతా ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘రక్తనాళాల’తోనూ మన ఐడెంటినీ గుర్తించే విధానాన్ని తాజాగా ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు […]

Update: 2021-02-19 03:13 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత టెక్ యుగంలో బడుల నుంచి బడా బడా కార్పొరేట్ ఆఫీసుల దాకా ‘బయోమెట్రిక్’ ఉపయోగించడం సాధారణమైపోయింది. స్మార్ట్‌ఫోన్‌‌తో పాటు ఎయిర్‌పోర్ట్, పోలీసు విభాగాలు, నైట్‌క్లబ్‌ వంటి పలు ప్రదేశాల్లోనూ ‘ఫేస్ రికగ్నిషన్’ తప్పనిసరైంది. ఇలా బయోమెట్రిక్, ఐరిస్, వాయిస్, ఫేషియల్ గుర్తింపును భద్రతా ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘రక్తనాళాల’తోనూ మన ఐడెంటినీ గుర్తించే విధానాన్ని తాజాగా ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు.

భద్రత కోసం వాడుతున్న ఆయా రికగ్నిషన్స్‌ను.. కాస్త తెలివి ఉపయోగించి డూప్లికేట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్‌ను మార్ఫ్ చేయడాన్ని కూడా చాలా సినిమాల్లో చూసేశాం. ఒకరు తమ చేతితో తాకిన ఉప‌రిత‌లం నుంచి వారి ఫింగర్ ప్రింట్స్ సేక‌రించి, సదరు వేలిముద్రను పోలిన ప్రింట్‌ను తయారుచేసి వినియోగించే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ విషయానికొస్తే.. అందులో ఫొటోలు, వీడియోలతో పాటు మన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంటాం. అయితే అటువంటి ఫొటోల ఆధారంగా ‘ఫేషియల్ రికగ్నిషన్’‌కు డూప్లికేట్ రూపొందించొచ్చు. ఐరిస్ ఆధారిత రికగ్నిషన్ గందరగోళపరిచేందుకు కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించవచ్చు. అందుకే నకిలీ తయారుచేయడానికి ఆస్కారం లేని గుర్తింపు విధానం కోసం ప్రయోగాలు చేసిన న్యూసౌత్‌వేల్స్ పరిశోధకులు.. చివరకు ‘వీన్స్ ఐడెంటిఫై’ వినియోగించడం ఉత్తమమైనదని గుర్తించారు. మానవ శరీరంలో ర‌క్తనాళాలు చ‌ర్మం కింద ఉంటాయి. కాగా వేలిముద్రల్లా వీటిని డూప్లికేట్ చేయలేము, సామాజిక మాధ్యమాల్లోనూ ల‌భించ‌వు, అలాగే ముఖాన్ని చూపే ఫొటోల్లాంటివి కావు. ఐరిస్‌ల మాదిరి వీటిని సేకరించడం, సృష్టించడం కూడా కష్టమే. అందుకే మిగతా వాటితో పోల్చితే ఇది అత్యంత భద్రతతో కూడినదిగా పరిశోధకుల్లో ఒకరైన షా వివరించారు. నిజానికి, ర‌క్తనాళాల ద్వారా మ‌నుషుల్ని గుర్తించ‌డం కొత్త పద్ధతేం కాదని, ఇందుకోసం ఓ ప్రత్యేక‌మైన సాంకేతిక‌త అవ‌స‌ర‌మ‌వుతుందని పరిశోధకులు తెలిపారు.

Tags:    

Similar News