ఫలక్ నుమా ప్యాలేస్ లో మ్యాట్రిక్స్ ఫైట్ నైట్..

దిశ, చార్మినార్: తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ శుక్రవారం సాయంత్రం బిగ్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ కు వేదికయ్యింది. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ లో ఆల్ ఇండియా మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్, కూతురు క్రుష్ణ ష్రాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 7గంటలకు మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాట్రిక్ ఫైట్ నైట్ పోటీలకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు […]

Update: 2021-12-11 00:21 GMT

దిశ, చార్మినార్: తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ శుక్రవారం సాయంత్రం బిగ్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ కు వేదికయ్యింది. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ లో ఆల్ ఇండియా మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్, కూతురు క్రుష్ణ ష్రాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 7గంటలకు మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాట్రిక్ ఫైట్ నైట్ పోటీలకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, ప్రముఖ బాలీవుడ్ గాయకురాలు ఆశా భోంస్లే మనవరాలు జనయా భోంస్లే, టీఆర్ఎస్ నాయకులు జయంత్ రెడ్డి లతో పాటు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

మ్యాట్రిక్ ఫైట్ నైట్ లో 9 ఫైట్ లలో 18 మంది దేశ, విదేశాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. ఒక్క ఫైట్ కు మూడు రౌండ్ లు, ఒక్క రౌండ్ కు 5 నిమిషాలు, మూడు రౌండ్ లకు 15 నిమిషాలు చొప్పున 9 ఫైట్ లు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన మ్యాట్రిక్ ఫైట్ రాత్రి 10.45 కు ముగిసింది. 8 ఫైట్ లలో యువకులు పాల్గొనగా , ఒక ఫైట్ లో యువతులు పాల్గొన్నారు. అందులో ఇంటర్నేషనల్ కు చెందిన యువకులతో కూడా ఒక ఫైట్ జరిగింది.

మణిపూర్ కు చెందిన బిశ్వామిత్ర మయాంగ బ్లామ్ తో మహారాష్ట్ర కు చెందిన అర్షియాన్ మెమోన్ తల పడ్డాడు. ఇందులో అర్షియాన్ మెమోన్ విజేతగా నిలిచారు. పంజాబ్ కు చెందిన గజేందర్ రావత్ తో మణి పూర్ కు చెందిన బోన్ జోవి పోటీ పడగా బోన్ జోవి విజేతగా నిలిచారు. ఢిల్లీకి చెందిన మణి దీప్ ప్రజా పతి తో తెలంగాణ కు చెందిన కరణ్ సింగ్ బరిలోకి దిగాడు. ఇందులో కరణ్ సింగ్ విజేత గా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సాహిల్ రాణా తో కర్ణాటక కు చెందిన క్లింటన్ డి క్రుజ్ పోటీ పడగా క్లింటన్ డి క్రుజ్ విజేతగా నిలిచాడు. మణిపూర్ కు చెందిన జో జో రాజ్ కుమారితో గుజరాత్ కు చెందిన ఇషికా తీటే పోటీ పడగా జోజో రాజ్ కుమారి విజేతగా నిలిచారు.

ఉత్తారాఖండ్ కు చెందిన అభిషేక్ నేగి తో బీహార్ కు చెందిన శ్యామా నంద్ బరిలో దిగగా శ్యామా నంద్ విజేత గా నిలిచారు. ఉత్తరా ఖాండ్ కు చెందిన అంగద్ బిస్త్ తో మణి పూర్ కు చెందిన చుంగ్ రేంగ్ కోరెన్ బరిలో దిగగా అంగద్ బిస్త్ విజేతగా నిలిచాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధృవ్ చౌదరి తో మహారాష్ట్ర కు చెందిన సుమిత్ కాడే తలపడగా ధృవ్ చౌదరి విజేతగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దుల్ బాదాక్షి తో బ్రెజిల్ కు చెందిన మెర్సిలో గౌరిల్లా బరిలో దిగగా అబ్దుల్ బాదాక్షి విజేతగా నిలిచారు.

Tags:    

Similar News