కేజీబీవీలో మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులు

దిశ, తెలంగాణ బ్యూరో: కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులను మంజూరు చేశారు. 180 రోజులపాటు సెలవులను కేటాయిస్తూ గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రెండు ప్రసవాలకు వేజెస్‌తో కూడిన సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టుగా తెలిపారు. గత కొంత కాలంగా కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు మెటర్నటీ సెలవుల కోసం ప్రభుత్వానికి వినతులు అందించారు. […]

Update: 2021-07-29 08:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులను మంజూరు చేశారు. 180 రోజులపాటు సెలవులను కేటాయిస్తూ గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రెండు ప్రసవాలకు వేజెస్‌తో కూడిన సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టుగా తెలిపారు.

గత కొంత కాలంగా కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు మెటర్నటీ సెలవుల కోసం ప్రభుత్వానికి వినతులు అందించారు. పరిశీలనలు చేపట్టిన ప్రభుత్వం సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో కేజీబీవీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News