భానుడి భగ భగలు.. జనం బేజారు..

దిశ, ముధోల్ : భానుడి వేడి భగ భగలు నిప్పులు కక్కుతున్నాయి. భగ భగ మండే ఎండలతో జనాలు బేజారు అవుతున్నారు. బయటకు వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజుల నుండి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎండలో తిరగాలంటే ప్రజలు భయంతో జంకుతున్నారు. అయినప్పటికీ పట్టణ ప్రజలకు ఎండలో తిరగటం తప్పడం లేదు. బైంసాలో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకే ప్రజలు తిరగడానికి అనుమతి వుండగా జనం మధ్యాహ్న […]

Update: 2021-04-01 04:35 GMT

దిశ, ముధోల్ : భానుడి వేడి భగ భగలు నిప్పులు కక్కుతున్నాయి. భగ భగ మండే ఎండలతో జనాలు బేజారు అవుతున్నారు. బయటకు వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజుల నుండి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎండలో తిరగాలంటే ప్రజలు భయంతో జంకుతున్నారు. అయినప్పటికీ పట్టణ ప్రజలకు ఎండలో తిరగటం తప్పడం లేదు.

బైంసాలో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకే ప్రజలు తిరగడానికి అనుమతి వుండగా జనం మధ్యాహ్న వేళలో సైతం పట్టణంలో తమ పనుల నిమిత్తం బయటకు వెళ్ళవలసి వస్తుంది. గురువారం పట్టణంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో ఎండకాలం మొదట్లోనే ఇలా ఉంటే ఇంకా రానున్న రెండు, మూడు నెలలు ఎలా ఉంటాదో అని ప్రజలు భయానికి గురవుతున్నారు.

 

Tags:    

Similar News