బ్రేకింగ్.. హన్మకొండలో HDFC బ్యాంకు వద్ద భారీ చోరి

దిశ, హన్మకొండ జిల్లా : నక్కలగుట్ట HDFC బ్యాంకు వద్ద భారీ చోరి ఘటన చోటుచేసుకుంది. దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ. 25 లక్షలు కాజేశారు. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి స్థానిక HDFC బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టి వచ్చి సంతకం కోసం మరోసారి బ్యాంకులోకి వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగులగొట్టి వాహనంలో ఉన్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో సదరు బాధితుడు వెంటనే […]

Update: 2021-11-15 05:53 GMT

దిశ, హన్మకొండ జిల్లా : నక్కలగుట్ట HDFC బ్యాంకు వద్ద భారీ చోరి ఘటన చోటుచేసుకుంది. దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ. 25 లక్షలు కాజేశారు. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి స్థానిక HDFC బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టి వచ్చి సంతకం కోసం మరోసారి బ్యాంకులోకి వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగులగొట్టి వాహనంలో ఉన్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో సదరు బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 

Tags:    

Similar News