నాన్నమ్మ వాళ్ల ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇళ్లు గుల్ల.. యాకుత్‌పురాలో భారీ చోరీ
దిశ, చార్మినార్: నెలరోజుల క్రితం నాన్నమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్ళు గుల్ల అయిన ఘటన పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీరువాలో దాచిన రూ.2.5 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, 25 తులాల వెండి, రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయని బాధితుడు రెయిన్బజార్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్ స్పెక్టర్ రంజిత్‌కుమార్ వివరాల ప్రకారం.. పాతబస్తీ యాకుత్‌పురా గంగానగర్ నాలా సమీప ప్రాంతానికి చెందిన మీర్సర్దార్ అలీ అబేద్ కుటుంబంతో […]
దిశ, చార్మినార్: నెలరోజుల క్రితం నాన్నమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్ళు గుల్ల అయిన ఘటన పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీరువాలో దాచిన రూ.2.5 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, 25 తులాల వెండి, రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయని బాధితుడు రెయిన్బజార్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్ స్పెక్టర్ రంజిత్‌కుమార్ వివరాల ప్రకారం.. పాతబస్తీ యాకుత్‌పురా గంగానగర్ నాలా సమీప ప్రాంతానికి చెందిన మీర్సర్దార్ అలీ అబేద్ కుటుంబంతో కలిసి నెలరోజుల క్రితం మొఘల్‌పురాలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లారు.
తిరిగి ఆదివారం ఇంటికొచ్చే సరికి ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగులకొట్టి, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే మీర్ సర్దార్ రెయిన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును రెయిన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.