మాస్క్‌ల షార్టేజ్.. రేటుకు వెయిటేజ్
దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర ప్రజలు కోవిడ్ -19 ప్రభావంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కోవిడ్ వ్యాధి సోకినట్టు ప్రభుత్వం నిర్ధారించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు నగరంలో ఇప్పుడు ఏ వ్యక్తిని చూసినా మాస్క్ ధరించే కన్పిస్తున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వారు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వారంతా దాదాపుగా […]
దిశ, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర ప్రజలు కోవిడ్ -19 ప్రభావంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కోవిడ్ వ్యాధి సోకినట్టు ప్రభుత్వం నిర్ధారించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు నగరంలో ఇప్పుడు ఏ వ్యక్తిని చూసినా మాస్క్ ధరించే కన్పిస్తున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వారు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వారంతా దాదాపుగా మాస్క్‌లు, జేబు రుమాళ్లు కట్టుకుని తిరుగుతున్నారు. మరికొందరు రెండు రెండు మాస్క్‌లు ధరిస్తున్నారు. దీంతో నగరంలో మందుల షాపుల్లో మాస్క్‌ల కొరత త్రీవంగా ఉంది.
ఇదే అదనుగా భావించిన మెడికల్ షాపు యాజమానులు మాస్క్‌ల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.2 లకు లభించే మాస్క్..కోవిడ్ ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.15 వరకు అమ్ముతున్నారు. ఫిల్టరింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండే ఎన్-95 మాస్క్ సాధారణంగా రూ.60 ల నుంచి రూ.70 ధరకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ మాస్క్‌ను మార్కెట్‌లో రూ.200లకు విక్రయిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని మూడు మెడికల్ దుకాణాల్లో ఎన్-95 మాస్క్‌ను ఒక్కో షాపులో ఒక్కో ధరకు అమ్ముతున్నారు. నగరంలోని ఉస్మానియా, నిలోఫర్ తదితర ప్రధాన ఆస్పత్రులతో పాటు ఇతర మందుల దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 12 వేలకు పైగా మెడికల్ షాపులు ఉంటే.. ఎంత ధర పెట్టి మాస్క్‌ను కొనుగోలు చేద్దామన్నా..మెడికల్ షాపుల్లో మాస్క్‌ల కొరత విపరీతంగా ఉంది.
నగరానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేందుకు ముందస్తుగా రాంనగర్‌లోని ఓ మెడికల్ షాపులో 100 మాస్క్‌లు కావాలని అడగగా.. లేవని చెప్పాల్సి వచ్చినట్టు ఆ మెడికల్ షాపు యాజమాని తెలిపారు. ఇదిలా ఉండగా..గ్రేటర్ పరిధిలో అసలు మాస్క్‌ల తయారీ లేకపోవడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మన రాష్ట్రంలో..ముఖ్యంగా నగరానికి కోయంబత్తూరు నుంచి మాస్క్‌లు దిగుమతి అవుతున్నట్టు మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. కానీ, నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రి యాజమాన్యానికి సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకునే వెసులుబాటు కలిగినట్టు..ప్రస్తుతం నగరంలో మాస్క్‌లకు గిరాకీ పెరగడంతో వారి వ్యాపారం జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.