పారిశుధ్య కార్మికులకు మాస్క్‌ల పంపిణీ

దిశ, హైదరాబాద్ : తెలంగాణ జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌస్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మిద్దె కృష్ణ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నివారణకు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి సాహసోపేతమైనదన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఇదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని […]

Update: 2020-04-09 11:07 GMT

దిశ, హైదరాబాద్ : తెలంగాణ జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌస్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మిద్దె కృష్ణ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నివారణకు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి సాహసోపేతమైనదన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఇదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అప్పటి వరకు కనీస వేతన చట్టం ప్రకారం పారిశుధ్య కార్మికులకు రూ.21 వేలకు వేతనం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Tags: ghmc, sanitation, worker, corona effect, midde krishna

Tags:    

Similar News