కరోనాను అడ్డుకోవాలంటే ఎలాంటి ఫేస్‌మాస్క్ ధరించాలి?

దిశ, వెబ్‌డెస్క్: వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్ష తాకిడి వల్ల లేదా అతను తుమ్మడం, దగ్గడం చేసినపుడు వెలువడిన తుంపర్ల కారణంగా కొవిడ్ 19 వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే అతిచిన్న తుంపర్లుగా పరిగణించే ఏరోసాలైజింగ్ డ్రాప్లెట్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని రుజువులు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం… వ్యాధిగ్రస్తుని నుంచి వెలువడిన బయోఏరోజాల్స్ ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. అందుకే మాస్కులు ఎంచుకునే విషయంలో తుంపర్లు, ఏరోసాలైజేషన్లలో […]

Update: 2020-04-08 00:16 GMT

దిశ, వెబ్‌డెస్క్:
వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్ష తాకిడి వల్ల లేదా అతను తుమ్మడం, దగ్గడం చేసినపుడు వెలువడిన తుంపర్ల కారణంగా కొవిడ్ 19 వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే అతిచిన్న తుంపర్లుగా పరిగణించే ఏరోసాలైజింగ్ డ్రాప్లెట్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని రుజువులు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం… వ్యాధిగ్రస్తుని నుంచి వెలువడిన బయోఏరోజాల్స్ ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. అందుకే మాస్కులు ఎంచుకునే విషయంలో తుంపర్లు, ఏరోసాలైజేషన్లలో వేరియేషన్ చూపించగల వాటిని గుర్తించగలగాలి. ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకునేవి, సర్జికల్ మాస్కులు ఈ ఏరోసాలైజేషన్లను అడ్డుకోలేవు. కేవలం ఎన్95 మాస్కులు మాత్రమే ఈ పని చేయగలవు.

సర్జికల్ మాస్కులు

ముక్కును, నోటిని కవర్ చేస్తూ చెవుల మీదుగా సులభంగా ధరించగల డిస్పోజబుల్ మాస్కులు ఇవి. సైడులో ఇలాంటి సంరక్షణ అందించని కారణంగా ఈ మాస్కులు చిన్న తుంపర్ల నుంచి ఎలాంటి రక్షణ కల్పించలేవు. ఇవి కేవలం పెద్ద తుంపర్లు, సలైవా, ఇతర శ్వాసద్రవాల నుంచి కాపాడగలవు. కాబట్టి సర్జికల్ మాస్కు ధరించినంత మాత్రాన కరోనా వైరస్ నుంచి తప్పించుకోగలమనుకోవడం పొరపాటే. కానీ ఒక వ్యాధిగ్రస్తుడు ధరిస్తే మాత్రం కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఈ మాస్కు అడ్డుకోగలుగుతుంది.

ఇది కూడా ఓ రకంగా మంచిదే. ఎందుకంటే వ్యాధి లక్షణాలు బయటపడక ముందే ఆ వ్యాధి వ్యాప్తి ఒకరి నుంచి ఒకరికి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కొందరిలో లక్షణాలు కనిపించకున్నా వ్యాప్తి కారకులయ్యే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ప్రస్తుతం సర్జికల్ మాస్కుల కొరత ఉంది. దీంతో కనీసం వైద్యసిబ్బందికైనా మెడికల్ గ్రేడ్ మాస్కులు అందజేయాలని పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్లు నొక్కివక్కాణిస్తున్నాయి.

ఎన్ 95 రెస్పిరేటర్లు

గాలిసహిత కణాలను అడ్డుకోగల మాస్కులు ఇవి. సరిగా ఉపయోగిస్తే చాలా సురక్షితం. వైద్యసిబ్బంది ముఖ్యంగా ఉపయోగించాల్సిన మాస్కులు ఇవే. ఊరికే బయట తిరిగేటపుడు ఇవి అంత అవసరం లేదు. ఈ మాస్కుల కొరత కూడా ప్రపంచవ్యాప్తంగా అధికంగానే ఉంది.
అయితే ప్రస్తుతానికి వైద్యసిబ్బంది సర్జికల్ మాస్కులు ఉపయోగించాలని, కేవలం ఇంట్యుబేషన్, సక్షనింగ్ లాంటి ఎయిర్‌బోర్న్ ప్రొసీజర్స్ సమయంలోనే ఎన్95 రెస్పిరేటర్ తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రభుత్వాలు సూచించాయి.

ఇంట్లో తయారు చేసిన గుడ్డ మాస్కులు

సర్జికల్ మాస్కులు, ఎన్95 రెస్పిరేటర్ల తయారీలో కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కానీ గుడ్డ మాస్కుల విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించనక్కర్లేదు. నచ్చిన వస్త్రంతో, నచ్చిన రీతిలో మాస్కు తయారుచేసుకోవచ్చు. ఇంట్లో చేసిన మాస్కు ధరించడం లేదా ముఖం చుట్టు కర్చీఫ్ లేదా స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల పెద్ద తుంపర్లను అడ్డుకోవచ్చు అలాగే ముఖాన్ని పదే పదే చేతుల్తో ముట్టుకోకుండా అడ్డుకోవచ్చు. ఈ మాస్కులు ధరించడం వల్ల వైద్యసిబ్బందికి, నిజంగా అవసరంలో ఉన్న వారికి సర్జికల్ మాస్కులు, ఎన్95 మాస్కులు మిగిల్చిన వాళ్లం అవుతాం.

మాస్కుల వల్ల సమస్యలు?

అవును.. మాస్కులు ధరించడం వల్ల కలిగే అతిపెద్ద సమస్య అతి నమ్మకం. మేం మాస్కు వేసుకున్నాం మాకు ఏం కాదు అనే ధీమా ఉండటంతో జనాలు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మాస్కు ఊడిపోతుంటే సెట్ చేసుకునే క్రమంలో ముఖాన్ని ఎక్కువసార్లు ముట్టుకునే ప్రమాదం ఉంది. సరిగా చేతులు కడుక్కుని మాస్కు ధరించడమో, తీయడమో చేస్తేనే మాస్కు వేసుకున్న విలువ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అలాగే సర్జికల్ మాస్కుల, ఎన్95 రెస్పిరేటర్లు కేవలం వైద్యసిబ్బంది, పేషెంట్లు మాత్రమే ధరించాలి. ఇతరులు సాధారణ మాస్కులు ధరించినా పర్లేదు. కానీ ఇతరులు కూడా సర్జికల్, ఎన్95 మాస్కులు ధరించడంతో నిజంగా అవసరమైన వారికి మాస్కుల కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags: Corona, COVID, Masks, Surgical masks, N95 respirators, Homemade masks

Tags:    

Similar News