మేరీకోమ్‌తో జత కట్టిన డ్రీమ్ స్పోర్ట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్. ఎంతోమంది మహిళా బాక్సర్లకు స్ఫూర్తిగా నిలిచింది. బాక్సింగ్‌లో పరుషులే కాదు.. మహిళాలు కూడా రాణించగలరని నిరూపించింది మేరీకోమ్. మణిపూర్‌కి చెందిన మేరీకోమ్ ఇప్పుడు మహిళా బాక్సర్లకు అండగా నిలుస్తోంది. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మేరీకోమ్ బాక్సింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళా బాక్సర్లకు శిక్షణ ఇస్తోంది. వారికి విద్య, ఫుడ్, వసతి కల్పిస్తూ ట్రైనింగ్ ఇస్తోంది. ఈ క్రమంలో మేరీకోమ్ బాక్సింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్. ఎంతోమంది మహిళా బాక్సర్లకు స్ఫూర్తిగా నిలిచింది. బాక్సింగ్‌లో పరుషులే కాదు.. మహిళాలు కూడా రాణించగలరని నిరూపించింది మేరీకోమ్. మణిపూర్‌కి చెందిన మేరీకోమ్ ఇప్పుడు మహిళా బాక్సర్లకు అండగా నిలుస్తోంది.
మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మేరీకోమ్ బాక్సింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళా బాక్సర్లకు శిక్షణ ఇస్తోంది. వారికి విద్య, ఫుడ్, వసతి కల్పిస్తూ ట్రైనింగ్ ఇస్తోంది. ఈ క్రమంలో మేరీకోమ్ బాక్సింగ్ ఫౌండేషన్‌తో డ్రీమ్ స్పోర్ట్స్ జతకట్టింది. మేరీకోమ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న మహిళా బాక్సర్లకు డ్రీమ్ స్పోర్ట్స్ ఆర్థిక సహకారం అందించనుంది. వారికి ఎడ్యుకేషన్, ట్రైనింగ్, వసతి, మెడికల్ విషయంలో ఆర్థిక సహాయం చేయనుంది.