Wagon-R…మెరుగైన మైలేజ్‌తో!
సరసమైన ధరలో కారు ఉంటే.. కొనడానికి సిద్ధంగా ఉన్నవారు కోట్లలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో తక్కువ ధరలో మధ్యతరగతి కుటుంబాన్ని ఆకట్టుకున్న కార్లలో మారుతీ సుజుకీ వారి వాగన్-ఆర్ ఒకటి. తక్కువ ధరలోనే అన్ని సౌకర్యాలతో, ఒక చిన్న కుటుంబానికి సరిపోయేలా ఉన్న ఈ కారు కొత్త మోడల్ వచ్చేసింది. ఈ ఏడాది నుంచి ఉద్గార నిబంధనల నేపథ్యంలో బీఎస్-6 వేరియంట్ మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. సరికొత్త వాగన్-ఆర్ ఎస్-సీఎన్జీ మోడల్ ధర రూ. […]
సరసమైన ధరలో కారు ఉంటే.. కొనడానికి సిద్ధంగా ఉన్నవారు కోట్లలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో తక్కువ ధరలో మధ్యతరగతి కుటుంబాన్ని ఆకట్టుకున్న కార్లలో మారుతీ సుజుకీ వారి వాగన్-ఆర్ ఒకటి. తక్కువ ధరలోనే అన్ని సౌకర్యాలతో, ఒక చిన్న కుటుంబానికి సరిపోయేలా ఉన్న ఈ కారు కొత్త మోడల్ వచ్చేసింది. ఈ ఏడాది నుంచి ఉద్గార నిబంధనల నేపథ్యంలో బీఎస్-6 వేరియంట్ మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. సరికొత్త వాగన్-ఆర్ ఎస్-సీఎన్జీ మోడల్ ధర రూ. 5.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రానున్న రెండేళ్లలో 10 లక్షల యూనిట్లను అమ్మాలనేది కంపెనీ లక్ష్యంగా సంస్థ పేర్కొంది.
ఈ మోడల్ 60 లీటర్ల ఇంఢన సామర్థ్యం కలిగి ఉంది. లీటర్‌కు 32.52 కిలోమీటర్ల అత్యధిక మైలేజీ ఇస్తుంది. వాగన్-ఆర్ రెండు వేరియంట్లలో వస్తుంది. Lxi.. షోరూమ్ ధర రూ. 5.25 లక్షలు. Lxi (O)… షోరూమ్ ధర రూ. 5.32 లక్షలు. ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పోలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ…రానున్న రెండేళ్లలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లతో మరిన్ని వాహనాలను విక్రయించనున్నట్టు ప్రకటించారు. కొత్తగా వచ్చిన ఈ సీఎన్జీ వేరియంట్ అధిక ఇంధన సామర్థ్యం, మెరుగైన భద్రత, ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.