రూమర్స్ పై మారుతి సుజుకీ క్లారిటీ
దిశ, వెబ్ డెస్క్: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి, హర్యానాలోని తన గురుగ్రామ్ ప్లాంట్ నుండి షిఫ్ట్ అవడానికి నిర్ణయించుకుంది. అయితే, హర్యానాలోనే ప్రత్యామ్నాయ ప్లాంట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని యోచిస్తోంది. హర్యానా ప్రభుత్వం తన గురుగ్రామ్ ప్లాంటుకు ప్రత్యామ్నాయంగా మారుతికి మరో మూడు ప్రాంతాల్లో భూస్థలాలను కేటాయించింది. అయితే గురుగ్రామ్ నుండి షిఫ్ట్ అవడానికి మారుతి ఇతర రాష్ట్రాల్లో సైట్లు అన్వేషిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఖండించారుమారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (maruti suzuki india limited) చైర్మన్ […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి, హర్యానాలోని తన గురుగ్రామ్ ప్లాంట్ నుండి షిఫ్ట్ అవడానికి నిర్ణయించుకుంది. అయితే, హర్యానాలోనే ప్రత్యామ్నాయ ప్లాంట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని యోచిస్తోంది. హర్యానా ప్రభుత్వం తన గురుగ్రామ్ ప్లాంటుకు ప్రత్యామ్నాయంగా మారుతికి మరో మూడు ప్రాంతాల్లో భూస్థలాలను కేటాయించింది.
అయితే గురుగ్రామ్ నుండి షిఫ్ట్ అవడానికి మారుతి ఇతర రాష్ట్రాల్లో సైట్లు అన్వేషిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఖండించారుమారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (maruti suzuki india limited) చైర్మన్ ఆర్‌సి భార్గవ. కొత్త ప్లాంట్ హర్యానాలోనే ఎక్కడో ఒకచోట ఉంటుందని ఆయన TOI కి చెప్పారు.
పాత ఢిల్లీ – గురుగ్రామ్ రహదారిపై ఉన్న గురుగ్రామ్ ప్లాంట్ మారుతి కార్ల మొదటి తయారీ కేంద్రం. ఏటా 7 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ప్లాంట్ సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా… మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. కాగా ఈ ఆటోమొబైల్ (automobile) దిగ్గజం 300 ఎకరాల స్థలంలో పని చేయడం కష్టంగా ఉండటంతో.. 700-1000 ఎకరాల పరిధిలో కార్ల తయారీకై కొత్త స్థలం కోసం చూస్తున్నట్లు తెలిపింది.