మా ఆయనకు విడాకులు ఇచ్చా.. నువ్వు పెళ్లి చేసుకో
దిశ, వెబ్డెస్క్: ‘నేను మా ఆయనకు విడాకులు ఇచ్చి వచ్చాను.. నన్ను కాదని నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా’ అంటూ ఓ వివాహిత ప్రియుడి ఇంటి ముందు భైఠాయించింది. తనను కాదని ఇంకొకరిని ఎలా పెండ్లి చేసుకుంటావని నిలదీసింది. దీంతో సదరు యువకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తన కోసం ఎదురుచూసిన సమయంలో తనను కాదని వేరే పెండ్లి చేసుకున్న ప్రియురాలు.. తీరా పెండ్లయిన సవంత్సరం తర్వాత తిరిగి వచ్చి నిలదీయడంతో ఆ ప్రియుడు, తల్లిదండ్రులకు మతిపోయినంత పనైంది. […]
దిశ, వెబ్డెస్క్: ‘నేను మా ఆయనకు విడాకులు ఇచ్చి వచ్చాను.. నన్ను కాదని నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా’ అంటూ ఓ వివాహిత ప్రియుడి ఇంటి ముందు భైఠాయించింది. తనను కాదని ఇంకొకరిని ఎలా పెండ్లి చేసుకుంటావని నిలదీసింది. దీంతో సదరు యువకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తన కోసం ఎదురుచూసిన సమయంలో తనను కాదని వేరే పెండ్లి చేసుకున్న ప్రియురాలు.. తీరా పెండ్లయిన సవంత్సరం తర్వాత తిరిగి వచ్చి నిలదీయడంతో ఆ ప్రియుడు, తల్లిదండ్రులకు మతిపోయినంత పనైంది. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడో కాదు.. కరీంనగర్ జిల్లాలో జరిగింది.
వివరాళ్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపల్లి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగుల చంద్రశేఖర్.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఇరువురు ప్రేమించుకుంటున్న తరుణంలోనే.. ప్రియురాలి ఇంట్లో వేరే సంబంధం చూశారు. ఆ సమయంలో ప్రియుడు గుర్తుకు రాలేదో, తల్లిదండ్రుల ఒత్తిడి చేశారో తెలియదు గానీ.. ప్రేమించిన వాడిని కాదని మరొకరిని వివాహం చేసుకుంది. దీంతో ఆ యువకుడు కూడా తన జీవితంపైనే మొగ్గు చూపాడు. ఆమె పెండ్లై ఏడాది వరకు ఎదురు చూసి.. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడు. తన పెండ్లికి చివరి క్షణంలో ప్రియురాలు అడ్డుతగిలింది. తాను తన భర్తకు విడాకులు ఇచ్చి వచ్చానని.. తనను పెండ్లి చేసుకోవాలని ఏకంగా ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగడం గమనార్హం.