మెదక్‌లో ఆత్మహత్య చేసుకున్న ఏపీకి చెందిన మహిళ

దిశ, మెదక్: భర్తతోపాటు కూలి పని కోసం వలస వచ్చిన కార్మికురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్చారంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని విశాఖపట్నం జిల్లా కోయూర్ మండలం కుంకూర్ గ్రామానికి చెందిన కోర బీమరాజు భార్య రూపి ( 19 ) తో కలిసి గణేశ పల్లి సిరామిక్స్ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్నారు. సొంతూరు వెళ్తామని రూపి కోరగా లాక్ డౌన్, కరోనా పరిస్థితి కారణంగా కుదరడం […]

Update: 2020-06-23 01:53 GMT

దిశ, మెదక్: భర్తతోపాటు కూలి పని కోసం వలస వచ్చిన కార్మికురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్చారంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని విశాఖపట్నం జిల్లా కోయూర్ మండలం కుంకూర్ గ్రామానికి చెందిన కోర బీమరాజు భార్య రూపి ( 19 ) తో కలిసి గణేశ పల్లి సిరామిక్స్ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్నారు. సొంతూరు వెళ్తామని రూపి కోరగా లాక్ డౌన్, కరోనా పరిస్థితి కారణంగా కుదరడం లేదని భర్త ఆమెకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన రూపి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్బారం వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News