గురువు గారి చెప్పుల సాక్షిగా.. ఒక్కటైన జంట
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే ఇంటి నిండా హడావిడి.. ఊరంతా సందడి. నెల రోజులపాటు చుట్టాలు, బంధుమిత్రుల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. కానీ ఓ పెళ్లి కేవలం 17 నిమిషాల్లో ఎలాంటి హంగామా లేకుండా జరిగిపోయింది. అది కూడా చెప్పుల సాక్షిగా జరగడం ఓ వింతైతే.. అతిథులకు భోజనాలు పెట్టకపోవడం మరో వింత. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ వివాహ వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింగ్‌పూర్‌కు చెందిన మనీశ్ దాస్ కరేలి, గరీమా దాసిన వివాహం నిశ్చయమైంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే ఇంటి నిండా హడావిడి.. ఊరంతా సందడి. నెల రోజులపాటు చుట్టాలు, బంధుమిత్రుల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. కానీ ఓ పెళ్లి కేవలం 17 నిమిషాల్లో ఎలాంటి హంగామా లేకుండా జరిగిపోయింది. అది కూడా చెప్పుల సాక్షిగా జరగడం ఓ వింతైతే.. అతిథులకు భోజనాలు పెట్టకపోవడం మరో వింత. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ వివాహ వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సింగ్‌పూర్‌కు చెందిన మనీశ్ దాస్ కరేలి, గరీమా దాసిన వివాహం నిశ్చయమైంది. ఈ వధూవరుల ఇరు కుటుంబాలు ధనవంతులే. ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంత పీట వేసి పెళ్లి చేసేంత ఆర్థిక స్థోమత ఉన్న వారే. ఊరందనీ పిలిచి పంచభక్ష్య పరమన్నాలు వడ్డించే తహత ఉన్న వారే. కానీ పెళ్లికి అతిథిలకు కూడా విందు పెట్టకుండా కేవలం 17 నిమిషాలు వివాహ తంతును ముగించి ఔరా అనిపించారు.
వధూవరుల కుటుంబ ఆచారాల ప్రకారం.. గురువు పవిత్ర పాదరక్షల సాక్షిగా వరుడు మనీశ్ దాస్ కరేలి, వధువు గరీమా దాసిన పెళ్లితంతును నిర్వహించారు. పాదరక్షలకు వధూవరులు ఎదురెదురుగా కూర్చుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి తంతు కేవలం 17 నిమిషాల్లో ముగియడం గమనార్హం. అయితే ఈ వివాహానికి వచ్చిన అతిథులకు పెళ్లింటి వారు ఎలాంటి ఆహారాన్ని పెట్టలేదు. హాజరైన బంధుమిత్రులను వధూవరులను మనసారా ఆశీర్వదించి వెళ్లారు. ఇంత వింతగా జరిగిన పెళ్లి ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారింది. అయితే వరుడి తండ్రి ఈ పెళ్లిపై స్పందించారు. కరోనా సమయంలో హంగు, ఆర్భాటాలు లేకుండా బంధుమిత్రులను ఇబ్బంది పెట్టకూడదనే ఇలా సింపుల్‌గా చేశామని పేర్కొన్నారు.