ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి: ఉత్తమ్

దిశ, ముషీరాబాద్: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి 24 వ వర్ధంతిని ఇందిరాపార్క్‌లోని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద బుధవారం నిర్వహించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు […]

Update: 2020-12-02 08:00 GMT

దిశ, ముషీరాబాద్: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి 24 వ వర్ధంతిని ఇందిరాపార్క్‌లోని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద బుధవారం నిర్వహించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎం.నాగేష్ ముదిరాజ్, సంగిశెట్టి జగదీష్, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లక్ష్మణ్, వై.శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ తదితర ప్రముఖులు చెన్నారెడ్డి సమాధి వద్ద పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… చెన్నారెడ్డి గొప్ప పరిపాలనాదక్షుడనీ, అన్ని వర్గాలను కలుపుకొని పాలన అందించిన మహోన్నత నాయకుడని గుర్తు చేసుకున్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News