పండ్ల మార్కెట్‌కు తాళం వేస్తాం.. 23లోగా వెళ్లాల్సిందే

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఈ నెల 23వ తేదీలోగా బాట‌సింగారం త‌ర‌లించాల‌ని మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మార్కెట్ స్థ‌లాన్ని ఖాళీ చేయించేందుకు మార్కెటింగ్ శాఖ చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం మార్కెటింగ్ శాఖ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌హ‌ర్ష నేతృత్వంలో క‌మీష‌న్ ఏజెంట్ల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ఈ స‌మావేశంలో ప‌ద్మ‌హ‌ర్ష మాట్లాడుతూ… కేబినెట్ నిర్ణ‌యం ప్ర‌కారం మార్కెట్ స్థ‌లంలో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన […]

Update: 2021-08-10 10:51 GMT

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను ఈ నెల 23వ తేదీలోగా బాట‌సింగారం త‌ర‌లించాల‌ని మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మార్కెట్ స్థ‌లాన్ని ఖాళీ చేయించేందుకు మార్కెటింగ్ శాఖ చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం మార్కెటింగ్ శాఖ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌హ‌ర్ష నేతృత్వంలో క‌మీష‌న్ ఏజెంట్ల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ఈ స‌మావేశంలో ప‌ద్మ‌హ‌ర్ష మాట్లాడుతూ… కేబినెట్ నిర్ణ‌యం ప్ర‌కారం మార్కెట్ స్థ‌లంలో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. మార్కెట్ త‌ర‌లింపు అనివార్యంగా మారింద‌న్నారు. ఈనెల 23వ తేదీలోపు ఖాళీ చేసి బాట‌సింగారం వెళ్లాల‌ని వ్యాపారుల‌కు సూచించింది. లేని ప‌క్షంలో పండ్ల మార్కెట్‌కు తాళం వేస్తామ‌ని తెలిపింది. కోహెడ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేంతవ‌ర‌కు తాత్కాలిక ప్రాతిప‌దిక‌న బాట సింగారంలోని లాజిస్థిక్ పార్కులో ప్ర‌స్తుత మార్కెటింగ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తించాల‌ని మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యించింద‌న్నారు. బాట సింగారంలో ఉన్న 11 ఎక‌రాల్లో రైతుల‌కు, వ్యాపారుల కోసం త‌గిన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 23లోపు మార్కెట్ స్థ‌లాన్ని వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌కు అప్ప‌గించాల్సి ఉంద‌న్నారు.

సౌక‌ర్యాలు లేకుండా ఎలా వెళ్లాలి..?

రెండు వారాల్లో మార్కెట్‌ను బాట‌సింగారం త‌ర‌లించాల‌ని మార్కెటింగ్ శాఖ తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని క‌మీష‌న్ ఏజెంట్లు, ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు, అన్ని సంఘాల ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు. కోహెడ‌లో ప‌క్కా నిర్మాణాలు చేస్తే ఎప్పుడైనా వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు త‌ర‌లింపు ఆపాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించామ‌ని, త‌ర‌లింపు వ్య‌వ‌హారం కోర్టు ఆధీనంలో ఉండ‌డంతో తాము ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం స‌మావేశంలో చెప్ప‌లేమ‌ని అలా చేస్తే కోర్టు నియ‌మాల‌కు విరుద్ధంగా ఉంటుంద‌ని కొంత మంది ఏజెంట్లు అధికారి ప‌ద్మ‌హ‌ర్ష‌కు తెలిపారు. బాట‌సింగారం లాజిస్టిక్ పార్కు స్థ‌లంలో కేవలం ఒక్క షెడ్డు మాత్రమే నిర్మించార‌ని, వంద‌ల మంది రైతుల‌కు ఎలా స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు వాదోప‌వాద‌ల మ‌ధ్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండానే స‌మావేశం ముగిసింది.

Tags:    

Similar News