పంచాయతీ సభ్యుడిపై మావోయిస్టుల కాల్పులు

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మిరాటూర్‌ గ్రామ పంచాయతీ సభ్యుడు బుద్రామ్ కశ్యప్‌పై మావోయిస్టులు కాల్పులు జరుపగా ఆయన మరణించినట్లు తెలిసింది. ఆయన సొంత గ్రామం తల్నార్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. బుద్రామ్ కశ్యప్ భోజనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద కూర్చొని ఉండగా మావోయిస్టు నక్సల్ వచ్చి ముందుగా అతనిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ […]

Update: 2021-03-26 11:34 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మిరాటూర్‌ గ్రామ పంచాయతీ సభ్యుడు బుద్రామ్ కశ్యప్‌పై మావోయిస్టులు కాల్పులు జరుపగా ఆయన మరణించినట్లు తెలిసింది.

ఆయన సొంత గ్రామం తల్నార్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. బుద్రామ్ కశ్యప్ భోజనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద కూర్చొని ఉండగా మావోయిస్టు నక్సల్ వచ్చి ముందుగా అతనిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Tags:    

Similar News